Friday, November 22, 2024

”ఆపరేషన్ దేవి శక్తి” పేరుతో భారత్‌కు అఫ్ఘాన్ శరణార్థుల తరలింపు

- Advertisement -
- Advertisement -

India evacuates over 800 people from Kabul

న్యూఢిల్లీ: తాలిబన్ల అధీనంలో ఉన్న అఫ్ఘానిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారత పౌరులను, అక్కడి హిందువులు, సిక్కు శరణార్థులను భారత్‌కు తరలించే కార్యక్రమానికి ”ఆపరేషన్ దేవి శక్తి” అని భారత ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ విషయం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం చేసిన ఒక ట్వీట్‌తో వెలుగులోకి వచ్చింది. కాబుల్ నుంచి ఢిల్లీకి మరో 78 మందిని తరలించిన సందర్భంగా జైశంకర్ ట్వీట్ చేస్తూ, ఆపరేషన్ దేవి శక్తి కొనసాగుతోంది.

78 మంది దుషాన్‌బే మీదుగా కాబుల్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఐఎఎఫ్, ఎయిర్ ఇండియా, విదేశీ వ్యవహారాల శాఖ సిబ్బంది అవిశ్రాంత కృషికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఆఫ్ఘాన్ రాజధాని కాబుల్‌ను తాలిబన్లు ఆగస్టు 15న స్వాధీనం చేసుకోగా మరుసటి రోజున కాబుల్ నుంచి ఢిల్లీకి 40 మంది భారతీయులను భారత ప్రభుత్వం తరలించడం ప్రారంభించింది. ఇప్పటి వరకు 800 మందికి పైగా ఢిల్లీకి చేరుకున్నారు. ఆగస్టు 17న భద్రతకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ సమావేశం జరిగింది. అఫ్ఘాన్ నుంచి భారత్‌కు రావాలని కోరుకుంటున్న సిక్కులు, హిందువులను సురక్షితంగా తరలించాలని ప్రధాని నరేంద్ర మోడీ అధికారులను ఈ సమావేశంలో ఆదేశించారు.

India evacuates over 800 people from Kabul

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News