Sunday, December 22, 2024

జులై 16 శాతం తగ్గిన ఎగుమతులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జులైలో దేశీయ ఎగుమతులు 32.25 బిలియన్ డాలర్లతో 15.88 శాతం క్షీణించాయి. గతేడాది ఇదే సమయంలో ఎగుమతులు 38.34 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈమేరకు సోమవారం ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది. అదే సమయంలో ఈ ఏడాది జూలైలో దిగుమతులు 52.92 బిలియన్ డాలర్లు, గత ఏడాది జూలైలో ఇది 63.77 బిలియన్ డాలర్లుగా ఉంది. జులైలో వాణిజ్య లోటు 20.67 బిలియన్ డాలర్లు, జూన్‌లో 20.13 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్తావల్ మాట్లాడుతూ, అంతర్జాతీయంగా ఎదురుగాలులు ఉన్నాయని అన్నారు. పలు దేశాల్లోనూ ఎగుమతి, దిగుమతుల్లో క్షీణత ఉందని అన్నారు. అమెరికా, యూరప్, చైనాల్లో ఆర్థిక మందగమనం, ఆర్థిక సంక్షోభం ప్రభావం వాణిజ్యంపై కనిపిస్తోంది. ఈ దేశాల్లో డిమాండ్ తగ్గుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News