Thursday, January 9, 2025

షేక్ హసీనా వీసా గడువు పొడిగించిన భారత్

- Advertisement -
- Advertisement -

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ను తమకు అప్పగించాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం ఇప్పటికే న్యూఢిల్లీకి సందేశం పంపింది. తాజాగా ఆమె పాస్‌పోర్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.ఈ పరిణామాల వేళ భారత ప్రభుత్వం హసీనా వీసా గడువును పొడిగించినట్టు తెలుస్తోంది. ఈమేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. హసీనా మరికొంతకాలం భారత్‌లో ఉండేందుకు వీలుగా ఆమె వీసా గడువును కేంద్రం పొడిగించినట్టు సదరు వర్గాలు పేర్కొన్నాయి. స్థానిక ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారా వచ్చిన అభ్యర్థనను కేంద్రం పరిశీలించిన తరువాత పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News