Wednesday, January 22, 2025

కొరియాతో మ్యాచ్ డ్రా

- Advertisement -
- Advertisement -

India failed to reach the final of Asian Cup Hockey Tournament

భారత్ ఫైనల్ ఆశలు గల్లంతు

జకర్తా: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ డ్రాతో సరిపెట్టుకుంది. మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 4-4 గోల్స్ తేడాతో డ్రాగా ముగించింది. దీంతో భారత్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. కొరియాతో పాటు మలేషియా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక జపాన్‌భారత్ జట్లు మూడో స్థానం కోసం పోటీపడుతాయి. కొరియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం కోసం చివరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కొరియా కూడా అసాధారణ ఆటతో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. భారత్, మలేషియా, కొరియా జట్లు చెరో ఐదు పాయింట్లు సాధించాయి. అయితే మెరుగైన గోల్స్ కలిగిన మలేషియా, కొరియా జట్లు టైటిల్ పోరుకు దూసుకెళ్లాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News