Thursday, January 23, 2025

ఆకలి భారతం

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ఆకలి సూచీలో భారత్ మరింత కిందికి

ఏడాదిలో ఏకంగా ఏడు స్థానాలు దిగువకు
121 దేశాల్లో 107వ స్థానంలో ఇండియా
నిరుడు 101వ స్థానంలో నిలిచిన భారత్
మనకన్నా మెరుగైన స్థితిలో పొరుగు దేశాలు
పౌష్టికాహార లోపం, పిల్లల ఎదుగుదల, శిశు
మరణాలు వంటి అంశాల ఆధారంగా స్కోరు
29.01 పాయింట్లతో తీవ్ర ఆందోళనకర
స్థితిలో మన దేశం ఇళ్లల్లో పెరిగిపోతున్న
పోషకాహార లోపం ప్రధాని మోడీ ఎప్పుడు
మేల్కొంటారు? చిదంబరం, సీతారాం
ఏచూరి, కెటిఆర్ ధ్వజం

న్యూఢిల్లీ: ఆకలి సూచీ2022లో భారత్ మరింత దిగజారింది. మొత్తం 121 దేశాలతో రూపొందిన ఈ జాబితాలో భారత్ 107వ స్థానానికి పడిపోయిం ది.2021లో 101వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది ఏకం గా ఏడు స్థానాలు దిగజారింది. పొరుగు (64వ ర్యాంక్), నేపాల్(81) బంగ్లాదేశ్( 84), పాకిస్థా న్(99) కంటే కూడా మన దేశం వెనుకబడ్డం విశేషం. కా గా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జిహెచ్‌ఐ)లో చైనా, టర్కీ, కు వైట్ సహా మొత్తం 17 దేశాలు టాప్ ర్యాంక్‌లో నిలిచాయి. ఈ దేశాల జిహెచ్‌ఐ స్కోరు 5 కంటే తక్కువగా ఉండడం గమనార్హం. దక్షిణాసియా దేశాల్లో అఫ్ఘానిస్థాన్ (109వ ర్యాంక్) మాత్రమే మనకన్నా వెనుకబడి ఉంది. ఈ మేరకు ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’ వెబ్‌సైట్ పేర్కొంది. కాగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌ను ఐర్లాండ్‌కు చెందిన సంస్థ ‘కన్సర్న్ వరల్డ్‌వైడ్’, జర్మనీకి చెందిన ‘వెల్ట్ హంగర్ హిల్ఫే’ సంస్థ సంయుక్తంగా రూపొందించాయి. ఈ క్రమంలో భా రత్‌లో ఆకలి కేకల ఘంటికలు ప్రమాదస్థాయిలో ఉన్నట్లు ఈ నివేదిక ప్రకటించింది. దేశంలో చైల్డ్ వేస్టింగ్ టు తక్కువ బరువు, ఎత్తు ఉండడం) 19.3 శా తంతో ప్రపంచంలోనే అత్యంత తీవ్ర సమస్యగా ఉంది.

భారత్‌లో పోషకాహార లోపం చాలా తీవ్రంగా ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ప్రపంచ, ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ఆకలిని సమగ్రంగా కొలవడానికి, గుర్తించడానికి సాధనంగా భావిస్తున్నారు. పోషకాహార లోపం, పిల్లల పెరుగదల, చైల్డ్ వేస్టింగ్, పిల్లల మరణాలు వంటి నాలుగు అంశాల ఆధారంగా జిహెచ్‌ఐలో స్కోరు ఇస్తారు. ఈ స్కోర్ల ఆధారంగా తక్కువ, మధ్యస్థం, తీవ్రం, ఆందోళన, తీవ్ర ఆందోళన అనే కేటగిరీలుగా దేశాలను విభజించారు. భారత్ 29.1 శాతం స్కోరుతో తీవ్రమైన ప్రభావిత దేశాల జాబితాలో నిలిచింది. ఇక భారత్ జిహెచ్‌ఐ స్కోరు కూడా క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. 2000 సంవత్సరంలో 38.8 ఉన్న స్కోరు 20142022 మధ్య కాలంలో 28.229.1 పరిధికి పడిపోయింది. అలాగే పోషకాహార లోపం కూడా దేశంలో పెరిగిపోయింది. 2018 2020లో 14.శాతం ఉండగా 2019 2021 నాటికి 16.3 శాతానికి పెరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం 82.8 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతుండగా ఒక్క భారత్‌లోనే 22.43 కోట్ల మంది ఉన్నారు. ఇక అయిదేళ్ల లోపు పిల్లల్లో శిశు మరణాల రేటు కూడా 2012 16మధ్య కాలంలో15.1 శాతంగా ఉండగా 2017 21 కాలానికి అది 19.3 శాతానికి పెరిగింది.

అయితే చైల్డ్ స్టంటింగ్( వయసుకు తగినట్లుగా ఎదుగుల లేకపోవడం)సమస్య , అలాగే శిశు మరణాల విషయంలో మాత్రం భారత్ మెరుగుదల కనబరిచింది. 2012 16 మధ్య కాలంలో చైల్డ్ స్టంటింగ్ 38.7 శాతం ఉండగా 2017 21 నాటికి అది 35.5 శాతానికి తగ్గింది. అలాగే శిశుమరణాల రేటు 2014లో 4.6 శాతంగా ఉండగా 2020 నాటికి అది 3.3 శాతానికి తగ్గింది. చత్తీస్‌గఢ్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు , విధానాలు చక్కగా అమలు కావడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని ఆ నివేదిక పేర్కొంది. కాగా ఆకలిని అంతమొందించడానికి ప్రపంచ దేశాలు చేస్తున్న పోరాటానికి కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం లాంటి వాటి న్రుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే ప్రమాదముందని, ఫలితంగా ఆకలి మరింతగా పెరిగే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది. అయితే గతంలో ఈ ఆకలి సూచీ నివేదికను కేంద్రం తప్పుబట్టింది.ఆకలి స్థాయిలను లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి అశాస్త్రీయంగా ఉందంటూ ఈ నివేదికను ఖండించింది.

ప్రధాని ఎప్పుడు స్పందిస్తారు : చిదంబరం

గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ మరింత దిగజారడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం స్పందించారు. నరేంద్ర మోడీ సారథ్యంలో 8 ఏళ్లలో జిహెచ్‌ఐలలో భారత్ స్కోరు దారుణంగా పడిపోయిందని విమర్శించారు. చిన్నారులకు సంబంధించిన పౌష్టికాహారలోపం, ఆకలి, కుంగుబాటు, వృథా వంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు స్పందిస్తారని ప్రశ్నించారు. 22.4 కోట్ల మంది భారతీయులకు పౌష్టికాహారం అందడం లేదన్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సైతం జిహెచ్‌ఐలో భారత్ మరింత దిగజారడంపై మోడీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. గత ఎనిమిదిన్నరేళ్లలో భారత్ ఈ చీకటి ప్రపంచంలోకి జారుకోవడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన ఒక ట్వీట్‌లో అన్నారు. ప్రచారార్భాటాలు, అబద్ధాలు ఇక కట్టిపెట్టాలని ఏచూరి మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలోవిరుచుకు పడ్డారు.

బిజెపి జోకర్లు ఆ నివేదికను కొట్టిపారేస్తారు : కెటిఆర్

ఆకలి సూచీలో భారత్ అట్టడుగున చేరింది. 121 దేశాల జాబితాతో విడుదలైన హంగర్ ఇండెక్స్‌లో భారత్ 107 స్థానంలో నిలిచింది. ఈ అంశంపై టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్‌పిఎ గవర్నమెంట్ సాధించిన మరో అద్భుతమైన విజయం ఇది అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఆకలి సూచీలో భారత్ 101వ స్థానం నుంచి 107వ స్థానానికి చేరిందని తెలిపారు. ఈ ఫెయిల్యూర్‌ను బిజెపి జోకర్స్ అంగీకరించకుండా, భారత్‌కు వ్యతిరేకంగా వచ్చిన నివేదిక అని కొట్టిపారేస్తారని తాను అనుకుంటున్నానని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

భారత ప్రధాని ఎవరిని నిందిస్తారు : అసదుద్దీన్

ఆకలి సూచీలో భారత దేశం మరింత దిగజారడంపై ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యు లు అసదుద్దీన్ ఒవైసి స్పందించారు. దీనిపై భారత ప్రధాని ఎవరిని నిందిస్తారని ఆయ న ప్రశ్నించారు. ప్రసంచ ఆకలి సూచీలో 121 దేశాలలో భారత దేశం 107వ స్థానంలో ఉందని, దక్షిణాసియాలో రెండో అతి చెత్త దేశంగా భారత దేశం దిగజారిందని ఆయనన్నారు. దీనిపై ప్రధాని మొఘలులను నిందించవచ్చని అయితే ఆయన పాలనలో 69 శాతం పిల్లలు పోషకాహార లోపం వల్ల మరణించారని తెలిపారు. ఆకలితో ఉన్న భారతీయుల సంఖ్య 19 కోట్ల నుంచి 35 కోట్లకు పెరిగిందన్నారు. 50 శాతం కంటె ఎక్కువ మంది పిల్లలు, మహిళలు రక్తహీనతతో ఉన్నారని అసదుద్దీన్ తెలిపారు. అయినా ప్రభుత్వం చులకనగా వ్యవహరిస్తోందన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో శ్రీలంక (64), నెపాల్ (81), బంగ్లాదేశ్ (84), పాకిస్తాన్ (99) స్థానాల్లో ఉంటే భారత దేశం మరింత అద్వాన్నంగా 107వ స్థానానికి దిగజారిందని ట్విట్టర్ వేదికగా ఒవైసి ట్వీట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News