Wednesday, January 22, 2025

ఫీల్డింగ్ లో టీమిండియా ఎన్నో స్థానంలో ఉందో తెలుసా?

- Advertisement -
- Advertisement -

ప్రపంచకప్‌లో అత్యుత్తమ ఫీల్డింగ్‌ను కనబరిచిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన ఇద్దరు క్రికెటర్లకు చోటు దక్కింది. రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లి ఐసిసి ఫీల్డర్ల జాబితాకు ఎంపికయ్యారు. జడేజా నాలుగో స్థానంలో, కోహ్లి ఆరో స్థానంలో నిలిచారు. ఆస్ట్రేలియా స్టార్ మార్నస్ లబుషేన్ 82.66 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక టీమ్ విభాగంలో ఆస్ట్రేలియా ప్రథమ స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా రెండో, నెదర్లాండ్స్ మూడో స్థానాన్ని సాధించాయి. భారత్‌కు నాలుగో స్థానం లభించింది. వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 40 నుంచి 50 పరుగుల వరుకు ఫీల్డింగ్ లోనే ఆపింది. భారత్ ఫీల్డింగ్ లో విఫలం కావడంతో ఓటమి చవిచూసిందని క్రికెట్ పండితులు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News