Saturday, November 23, 2024

ఇంగ్లండ్‌తో భారత్ ఢీ

- Advertisement -
- Advertisement -

నేటి నుంచి మహిళల టెస్టు పోరు

బ్రిస్టోల్ : భారత్‌ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్‌కు బుధవారం తెరలేవనుంది. బ్రిస్టోల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. పురుషుల విభాగంతో పోల్చితే మహిళల క్రికెట్‌లో టెస్టు మ్యాచ్‌లు చాలా తక్కువ సంఖ్యలో జరుగుతాయనే చెప్పాలి. 1934లో మహిళల విభాగంలో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరిగిన 42 ఏళ్ల తర్వాత భారత మహిళా జట్టు తన తొలి టెస్టు మ్యాచ్‌ను ఆడింది. ఇక 45 ఏళ్ల సుదీర్ఘ మహిళా క్రికెట్ ప్రస్థానంలో భారత జట్టు ఇప్పటి వరకు 36 టెస్టులు మాత్రమే ఆడింది. ఇందులో ఐదు మ్యాచ్‌లలో గెలిచి మరో ఆరింటిలో ఓటమి పాలైంది.

ఇక 25 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. కాగా ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు టెస్టు మ్యాచ్ ఆడనుంది. మిథాలీరాజ్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. కొన్నేళ్లుగా భారత మహిళా జట్టు కేవలం వన్డేలు, ట్వంటీ20 ఫార్మాట్‌కే పరిమితమైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, విండీస్, న్యూజిలాండ్ తదితర మహిళా జట్లు తరచూ టెస్టు క్రికెట్‌ను ఆడుతున్నా భారత్ మాత్రం ఈ ఫార్మాట్‌పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇదిలావుండగా సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి టెస్టు కావడంతో అందరి దృష్టి దీనిపై నెలకొంది. ఇక భారత్‌తో పోల్చితే ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో చాలా మెరుగ్గా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News