- Advertisement -
న్యూఢిల్లీ : ఖతార్‌లో ఎనమండుగురు భారతీయ మాజీ నౌకాధికారులకు మరణశిక్షల విధింపు అంశంలో భారత ప్రభుత్వం స్పందించింది. ఎటువంటి కారణాలను చూపకుండానే వీరిని అరెస్టు చేశారు. గత నెలలో మరణశిక్ష తీర్పు వెలువరించారు. దీనిని వీటిని సవాలు చేస్తూ భారతదేశం గురువారం అప్పీలు చేసుకుంది. తీర్పు పట్ల ఇప్పటికే భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ కేసుకు , అధికారులపై అభియోగాలు, వీరికి శిక్షల కారణాలతో కూడిన తీర్పుల వివరాలు ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో తమకు తెలియచేయలేదని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బగ్చి విలేకరుల సమావేశంలో తెలిపారు. తీర్పును పూర్తిగా రహస్యంగా ఉంచారు. కేవలం లీగల్ టీంకు తెలియచేశారు. సంబంధిత సమాచారం మేరకు ఇప్పుడు భారత ప్రభుత్వం తగు విధంగా స్పందిస్తోందని వివరించారు.
- Advertisement -