నాంటింగ్‌హామ్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు భారత్ 84.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్, జడేజా హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో 95 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు రిషబ్ పంత్ 25 పరుగులు చేసి రాబీన్ సన్ బౌలింగ్‌లో బైస్ట్రోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెఎల్ రాహుల్ 84 పరుగులు చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రవీంద్ర జడేజా 56 పరుగులు చేసి రాబీన్ సన్ బౌలింగ్‌లో బ్రాడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. షార్దూల్ టాగూర్ డకౌట్ రూపంలో అండర్సన్ బౌలింగ్ ఔటయ్యాడు. భారత బ్యాట్స్ మెన్లలో రోహిత్ శర్మ(36), ఛటేశ్వరా పూజారా(04), విరాట్ కోహ్లీ(0), అజింక్య రహానే(05), మహ్మాద్ షమీ(13), బుమ్రా(28), సిరాజ్(7) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ నాలుగు వికెట్లు పడగొట్టగా రాబీన్ సన్ ఐదు వికెట్లు తీశాడు.
ఇండియా తొలి ఇన్నింగ్స్ 278
- Advertisement -
- Advertisement -
- Advertisement -