- Advertisement -
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 95.5 ఓవర్లలో 337 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు వాషింగ్టన్ సుందర్ 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. సుందర్‌కు ఎవరు సహకారం అందించకపోవడంతో టీమిండియా 337 పరుగులు చేయాల్సి వచ్చింది. ఏడో వికెట్‌పై సుందర్, అశ్విన్ 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లాండ్ బౌలర్లలో డామ్ బెస్ నాలుగు వికెట్టు పడగొట్టగా లీచ్, ఆర్చర్, జేమ్స్ అండర్సన్ తలో రెండు వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జీరో పరుగుల వద్ద రాయ్ బర్న్ ఔటయ్యారు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రహానే కు క్యాచ్ ఇచ్చి బర్న్స్ ఔటయ్యారు.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 578
- Advertisement -