Thursday, January 23, 2025

టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ 445 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 130.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 445 పరుగులు చేసి ఆలౌటైంది. తొలి రోజు టీమిండియా 86 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. రెండో రోజు టీమిండియా ఇంకా 129 పరుగులు జోడించి ఆలౌటైంది. రెండో రోజు అశ్విన్-జురెల్ 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించారు. భారత బ్యాట్స్‌మెన్లు రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(112), సర్ఫరాజ్ ఖాన్(62), ధ్రువ్ జురెల్(46), రవిచంద్రన్ అశ్విన్(37), బుమ్రా(26), యశస్వి జైస్వాల్(10), రజత్ పాటీదర్(5), కుల్దీప్ యాదవ్(04), సిరాజ్ (3 నాటౌట్) శుబమన్ గిల్(0) పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ నాలుగు వికెట్లు తీయగా రెహాన్ అహ్మాద్ రెండు వికెట్లు, జేమ్స్ అండర్‌సన్, టామ్ హార్ట్‌లే, జోయ్ రూట్ తలో ఒక వికెట్ తీశారు.

డెబ్యూ మ్యాచ్ లో ధ్రువ్ జురెల్ 46 పరుగులు చేయడంతో రెండో వికెట్ కీపర్ గా రికార్డు సృష్టించాడు. 1934 ఈడెన్ గార్డెన్ లో ఇంగ్లాండ్ పై డిలవర్ హస్సేన్ 59 పరుగులు చేసి తొలి వికెట్ కీపర్ గా రికార్డులో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News