చెన్నై: ఇంగ్లండ్‌తో శుక్రవారం ఆరంభమైన తొలి టెస్టులో భారత బౌలర్లు మొదటి రోజు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను వారి సొంత గడ్డపై హడలెత్తించిన భారత బౌలర్లు సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో మాత్రం ఆ స్థాయిలో రాణించడంలో విఫలమయ్యారు. బుమ్రా, ఇషాంత్, అశ్విన్, సుందర్ తదిరులు ఉన్నా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌పై ప్రభావం చూపలేక పోయారు. దీంతో మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్ స్పష్టమైన ఆధిపత్యం చెలాయించింది.
అద్భుత ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ సారధి జో రూట్ అజేయ శతకంతో అలరించాడు. అతనికి ఓపెనర్ డొమినిక్ సిబ్లి అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. దీంతో ఇంగ్లండ్ తొలి రోజు పటిష్టస్థితిలో నిలిచింది. ఈ పరిస్థితుల్లో రెండో రోజు ఆట భారత్‌కు చాలా కీలకంగా మారింది. శనివారం ఆట ప్రారంభంలోనే భారత బౌలర్లు వికెట్లు తీయాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇంగ్లండ్‌ను సాధ్యమైనంత తక్కువ స్కోరుకే కట్టడి చేయక తప్పదు. ఇప్పుడూ జట్టు భారమంతా బౌలర్లపైనే ఆధారపడి ఉంటుంది. రూట్‌తో పాటు స్టోక్స్, బట్లర్ తదితరులను వెంటవెంటనే పెవిలియన్ పంపించాలి. అప్పుడే ఈ మ్యాచ్‌లో భారత్‌కు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి.