Thursday, January 23, 2025

ఐరాసలో భారత రాయబారి రుచిరా కాంబోజ్ అరుదైన ఘనత

- Advertisement -
- Advertisement -

India first woman UN envoy as she takes charge

న్యూయార్క్ : ఐరాసలో భారత రాయబారి రుచిరా కాంబోజ్ అరుదైన ఘనత సాధించారు. ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు. మనదేశం నుంచి ఈ రికార్డు సాధించిన మొదటి మహిళ ఆమే కావడం విశేషం. ఈ జూన్‌లో ఆమె నియామకం ఖరారు కాగా, దానికి సంబంధించి పత్రాలను నిన్న సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె ‘ భారత్‌కు చెందిన ఒక మహిళకు తొలిసారి ఈ పదవి దక్కడం ఒక గొప్ప గౌరవం. మహిళలందరికీ నేను చెప్పేదొక్కటే. మనం ఏదైనా సాధించగలం. ’ అని ఆమె బాధ్యతలు స్వీకరిస్తోన్న చిత్రాన్ని ట్విటర్ వేదికగా షేర్ చేశారు. 1987 లో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్‌కు ఎంపికైన రుచిరా కాంబోజ్ (58), టీఎస్ తిరుమూర్తి స్థానంలో ఈ బాధ్యతలు చేపట్టారు. ఆ ఏడాది సివిల్ సర్వీసెస్‌లో మహిళా విభాగంలో ఆమె ఆలిండియా మొదటి ర్యాంకు , ఫారిన్ సర్వీస్ విభాగంలో కూడా మొదటి ర్యాంకు సాధించారు. ఆ తర్వాత ఫారిన్‌లో మొదట బాధ్యతలు స్వీకరించి, దౌత్యాధికారిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ మన దౌత్య కార్యాలయంలో థర్డ్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. తర్వాత విదేశాంగ శాఖ కింద పనిచేశారు. అనంతరం మారిషస్, దక్షిణాఫ్రికా , భూటాన్ సహా మరికొన్ని దేశాల్లో సేవలు అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News