Thursday, November 14, 2024

భారత్ జిడిపి 6.1 శాతానికి పెంపు ఐఎంఎఫ్ అంచనా

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (202324) భారతదేశం జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) అంచనాను 6.1 శాతానికి అంటే 20 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ప్రకటించింది. ఈ మార్చి త్రైమాసికంలో భారత్ వృద్ధి అంచనా కంటే మెరుగ్గా ఉండడం వల్ల వృద్ధి రేటును పెంచినట్టు సంస్థ తెలిపింది. 2023లో అంచనా కంటే మెరుగైన పరిస్థితుల వల్ల భారత్ వృద్ధి రేటులో 0.2 శాతం పెంపుతో సవరించినట్టు ఐఎంఎఫ్ వెల్లడించింది. అలాగే చైనా వృద్ధి మందగిస్తున్నప్పటికీ సానుకూల పరిస్థితులతో ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాను కూడా 0.2 శాతం మేరకు సంస్థ పెంచింది. గతంలో ప్రకటించిన 2.8 శాతం నుంచి 3 శాతానికి ప్రపంచ వృద్ధి అంచనాను సవరిస్తున్నట్టు సంస్థ తెలిపింది.

Also Read: జనసేన గూటికి పిల్లి సుభాష్ చంద్రబోస్?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News