Wednesday, January 22, 2025

2024లో భారత్ జిడిపి 6.5 శాతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బడ్జెట్‌ను సమర్పించడానికి ముందు ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్య నిధి) 2024లో భారతదేశం 6.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ఐఎంఎఫ్ తన అంచనాను 20 బేసిస్ పాయింట్లు పెంచింది. 2025లో కూడా భారత జిడిపి 6.5 శాతంగా ఉండవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అయితే ఇది 2023కి అంచనా వేసిన 6.7 శాతం కంటే తక్కువగా ఉంది. 2023-24లో జిడిపి 7.3 శాతంగా ఉండవచ్చని భారత ప్రభుత్వ అంచనా వేసింది. ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం, బలమైన దేశీయ డిమాండ్ కారణంగా, భారతదేశం రెండు సంవత్సరాల్లో(2024, 2025) 6.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుంది. ఐఎంఎఫ్ తన అంచనాను 0.20 బేసిస్ పాయింట్ల మేర అప్‌గ్రేడ్ చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, 3 శాతం కోసం కష్టపడాల్సి ఉందని తెలిపింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ పోస్ట్
ఐఎంఎఫ్ పెంచిన భారతదేశ జిడిపి అంచనాను ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ తన పోస్ట్‌లో ప్రపంచంలోని ప్రధాన దేశాలలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక దేశం అని పేర్కొంది. 2024లో ఆసియా దేశాల జిడిపి 5.2 శాతంగా ఉంటుందని, ఇది 2023 కంటే తక్కువగా ఉంటుందని ఐఎంఎఫ్ తన అంచనాలో పేర్కొంది. 2023లో జిడిపి 5.4 శాతం, 2024లో ప్రపంచ జిడిపి 3.1 శాతంగా అంచనా వేసింది. అయితే 2025లో ఇది కాస్త మెరుగ్గా 3.2 శాతంగా ఉండవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News