Monday, December 23, 2024

రిపబ్లిక్ డే పరేడ్‌కు 23 శకటాల ప్రదర్శన

- Advertisement -
- Advertisement -

ఈసారి ప్రధానంగా నారీశక్తి నేపథ్యంతో ప్రదర్శనలు
పునరుద్ధరించిన కర్తవ్యమార్గంలో మొదటిసారి వేడుకలు

న్యూఢిల్లీ : 74 వ రిపబ్లిక్‌డే ఉత్సవాలకు ఢిల్లీ సిద్ధమైంది. పునరుద్ధరించిన సెంట్రల్ విస్టా ఈ ఉత్సవాలకు వేదిక కానుంది. ఈ వేడుకలను సందర్శించే ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో 32,000 టికెట్లను విక్రయానికి ఉంచింది. పునరుద్ధరించిన కర్తవ్య మార్గంలో వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన రంగురంగుల శకటాలను ప్రదర్శిస్తారు. మెజార్టీ శకటాల్లో ‘నారీశకి’్త ని ప్రతిబింబించే నేపథ్యం ప్రధానంగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన అధికారులు ఆదివారం తెలిపారు.

మొత్తం 23 శకటాల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవి 17, వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాలకు చెందినవి 6 ఉంటాయి. దేశ విస్తృత సాంస్కృతిక వారసత్వం, ఆర్థిక, సామాజిక పురోగతిని ఈ శకటాలు ప్రతిబింబిస్తాయి. కేంద్ర మంత్రిత్వశాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ రెండు శకటాలను ప్రదర్శిస్తుంది. ఒకటి మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం (ఎన్‌సిబి)ది కాగా, రెండోది కేంద్ర సాయుధ పోలీస్ బలగాల (సిఎపిఎఫ్)ది. వ్యవసాయ మంత్రిత్వశాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ చెరో ఒక శకటాన్ని ప్రదర్శిస్తాయి.

కేంద్ర సాంస్కృతిక శాఖ, పబ్లిక్ వర్క్ విభాగం ఈ రెండూ కేంద్ర గృహనిర్మాణ, అర్బన్ వ్యవహారాల విభాగం పరిధిలో ఉన్నాయి. ఢిల్లీ లోని రాష్ట్రీయ రంగ్‌శాల క్యాంప్ వద్ద ఈ శకటాల ప్రివ్యూ ప్రదర్శించారు. వీటిలో కొన్ని ఇంకా తుదిమెరుగులు దిద్దుకొంటున్నాయి. ఈ సారి రైల్వే మంత్రిత్వశాఖ నుంచి ఎలాంటి ప్రదర్శన లేదు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో దుర్గాపూజ ప్రతిబింబించేలా శకటాన్ని రూపొందించింది. అస్సాం రాష్ట్రం లెజెండరీ వీరయోధుడు అహోం జనరల్ లాచిట్ బౌర్పుకాన్ పరాక్రమాన్ని తెలియజేసే శకటాన్ని రూపొందించింది. మొట్టమొదటిసారి ఈ శకటాన్ని ప్రదర్శిస్తున్నారు. పెరేడ్ కోసం పూర్తి రిహార్సల్ సోమవారం నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News