Monday, December 23, 2024

విద్య, శిక్షణ నైపుణ్యం కోసం ఇండియా-జర్మనీ భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సరైన నైపుణ్యాలతో యువతకు సాధికారిత అందించడం, వారికి సరైన అవకాశాలను అందించడం ద్వారా ఆర్ధికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా ఇండో– జర్మన్‌ జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ యొక్క 12వ సమావేశం జరిగింది. వృత్తి విద్య మరియు శిక్షణ (వెట్‌)ను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించారు. జర్మన్‌ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాధాన్యతా రంగాలలో నైపుణ్యావసరాలను అందుకునేలా వెట్‌ కోసం ప్రామాణిక యంత్రాంగాన్ని సంస్ధాగతీకరించడం లక్ష్యంగా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. నైపుణ్య అంతరాలను అంచనా వేసేందుకు స్కిల్‌ మ్యాపింగ్‌ ఎక్సర్‌సైజ్‌ చేపట్టడంతో పాటుగా దానిని అనుసరించి, బ్రిడ్జ్‌ కోర్సులు మరియు అప్‌ స్కిల్లింగ్‌ కార్యక్రమాలను భారతీయ కార్మికుల నైపుణ్య శిక్షణ కోసం రూపకల్పన చేశారు.

భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి మరియు ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ కె కె ద్వివేది మరియు డివిజన్‌ 222 ః అలెగ్జాండర్‌ హాచార్డెల్‌, సీనియర్‌ పాలసీ ఆఫీసర్‌ ఆఫ్‌ డివిజన్‌ 222: ఎరాస్మస్‌ ; ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఇన్‌ వొకేషనల్‌ ట్రైనింగ్‌, ఫెడరల్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (బీఎంబీఎఫ్‌) లు ఈ సమావేశానికి సహ అధ్యక్షతను వహించారు.

ఈ సమావేశంలో, రెండు భాగస్వామ్య దేశాలు శిక్షణ, మూల్యాంకనం మరియు సర్టిఫికేషన్స్‌ కోసం అంతర్జాతీయ ప్రమాణాలను కలిగి ఉన్న సంబంధిత సంస్ధలతో జీ2జీ, జీ2బీ, బీ2బీ భాగస్వామ్యాల ద్వారా ఇరు దేశాలలోని శిక్షణా ప్రదాతలకు పరస్పర అక్రి డిటేషన్‌ ద్వారా ఆర్ధికాభివృద్దిలో నైపుణ్యం కలిగిన, సర్టిఫైడ్‌ కార్మికులు ఎలా పాల్గొనవచ్చనే దానిపై ఎంప్లాయర్‌ కనెక్ట్‌, అవగాహన కోసం కార్యాచరణ తీసుకురావడంపై కూడా చర్చించారు.

ఫెడరల్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (బీఎంబీఎఫ్‌) మరియు ఫెడరల్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎకనమిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీఎంజెడ్‌)లు ఉద్యోగ వివరణ, అర్హత ప్రమాణాలు, విదేశీ భాషా శిక్షణ, బోధనాంశాల వివరాలతో సహా ఎన్‌ఎస్‌డీసీఐకు డిమాండ్‌ అవసరాలు మరయు ఎంప్లాయర్‌ మాండేట్స్‌ను సమగ్రం చేయడం గురించి చర్చించాయి. బీఎంబీఎఫ్‌ మరియు బీఎంజెడ్‌లు ఇప్పుడు ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌ (టీఓటీ), ట్రైనర్స్‌ ఆఫ్‌ యాక్ససర్స్‌(టీఓఏ), విదేశీ భాషా శిక్ష ణ, పరిశ్రమ సంబంధిత కంటెంట్‌ మరియు కరికుల్యమ్‌ అభివృద్ధికి సాంకేతిక మద్దతు సైతం అందిస్తున్నాయి.

భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్ధాపక మంత్రిత్వశాఖ జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ కె కె ద్వివేది మాట్లాడుతూ ‘‘యూరోప్‌లో భారతదేశానికి అతి ముఖ్యమైన భాగస్వాములలో ఒకటి జర్మనీ. ఇరు దేశాల నడుమ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతమవుతున్నాయి. నేటి సమావేశంలో జరిగిన చర్చతో ఈ రెండు దేశాల నడుమ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. అంతేకాదు, సరైన మద్దతు మరియు వృత్తి విద్య , శిక్షణతో ప్రతిభ ద్వారా ఆర్థికాభివృద్దిని సైతం వేగవంతం చేయనున్నాము. భారతదేశం నుంచి జర్మనీకి కార్మిక శక్తి తరలివెళ్లేందుకు అత్యున్నత సామర్ధ్యం ఉంది. వాస్తవమేమిటంటే, 2021లో జర్మనీ యొక్క బ్లూ కార్డ్‌ గ్రహీతలలో దాదాపు మూడవ వంతు భారతదేశం నుంచి ఉన్నారు. ఇది జర్మనీలో అవసరమైన నైపుణ్యాలు మరియు ప్రతిభ ; భారతదేశంలో ఉన్న విద్య, నైపుణ్యంతో కూడిన యువత మధ్య ఉన్న సారుప్యతలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ యువతే జర్మనీతో భారతదేశపు బహుముఖ సహకారానికి సానుకూలంగా తోడ్పాటునందిస్తుంది.

నైపుణ్యాభివృద్ధిలో అత్యంత స్ధిరమైన నమూనాలలో ఒకటిగా అప్రెంటిస్‌షిప్‌ ఒకటి. విద్య, వృత్తి విద్య రంగాలలో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణపై దృష్టి సారించి వర్ట్యువల్‌/ ఫిజికల్‌ ఎక్సేంజ్‌ కార్యక్రమాలకు ఇండియా ప్రతిపాదించింది. దీనిలో భాగంగా విద్యార్ధులు ఇరు దేశాలలో ఉద్యోగ ప్రాజెక్టులపై పనిచేయడం ద్వారా కొంత సంపాదించుకోగలరు’’ అని అన్నారు.

అలెగ్జాండర్‌ హాచార్డెల్‌ , సీనియర్‌ పాలసీ ఆఫీసర్‌ ఆఫ్‌ డివిజన్‌ 222 ః ఎరాస్మస్‌ ; ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఇన్‌ వొకేషనల్‌ ట్రైనింగ్‌, ఫెడరల్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (బీఎంబీఎఫ్‌) మాట్లాడుతూ ‘‘భారతదేశంలో విస్తృత స్ధాయిలో ప్రతిభావంతులైన యువతరం ఉంది. విభిన్న రంగాల కోసం అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరుల అవసరాన్ని తీర్చగల సామర్థ్యం వీరికి ఉంది. నిస్సందేహంగా వెట్‌ , నేటి శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థలో అత్యున్నతంగా నిలువనుంది. కొవిడ్‌ మహమ్మారి అనంతర కాలంలో గణనీయమైన మార్పులను ఇది చూసింది. నేటి పని ప్రపంచంలో ఈ మార్పుకు తగిన సమాధానాన్ని నైపుణ్యంతో కూడిన మానవ వనరులు మాత్రమే తీర్చగలవు. ఇటీవలనే ప్రకటించిన జర్మన్‌ ఇమ్మిగ్రేషన్‌ చట్టంలో ప్రస్తుత విధానం కింద ఇరు దేశాల నడుమ సారుప్యతలు కలిగిన ప్రొఫెషనల్‌ క్వాలిఫికేషన్స్‌ గుర్తించడం అత్యంత కీలకం. అంతేకాదు, జర్మనీలోని కీలకరంగాలలోని నైపుణ్యాల అంతరాలను మ్యాపింగ్‌ చేయాల్సి ఉందని కూడా గుర్తించారు. దీని ఆధారంగా ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి భారతీయ కార్మికశక్తి జర్మనీకి తరలివెళ్లేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం బ్రిడ్జ్‌ కోర్సులను సైతం రూపొందించాల్సి ఉంది’’ అని అన్నారు.

గతంలో ఇండియా, జర్మనీ తో ఇండో–జర్మనీ వృత్తి విద్య శిక్షణ, సైనేడ్‌, ఇగ్నైట్‌ (ఇండో–జర్మన్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌), క్వాల్‌ ఇండియా మరియు ఐమూవ్‌ వంటి ప్రాజెక్టుల ద్వారా భారతీయులు విదేశాలకు వెళ్లేందుకు తోడ్పడుతుంది. అందువల్ల, నైపుణ్య అంతర మ్యాపింగ్‌ మరియు గ్లోబల్‌ స్కిల్‌ హార్మోనైజేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ కోసం ప్రామాణిక యంత్రాంగం వైపు మళ్లడమనేది వలస కార్మికుల ఆదాయాలు, రెమిటెన్స్‌ బదిలీలను మెరుగుపరచడంలో అత్యంత కీలకం.

బాటమ్‌ అప్‌ విధానం (సైనేడ్‌) ద్వారా ఉత్తర భారతదేశంలో పారిశ్రామిక క్లస్టర్లలో డ్యూయల్‌ వెట్‌ యొక్క కంపెనీ మోడల్స్‌ను బలోపేతం చేయడంపై బీఎంబీఎఫ్‌ ఒక కాంప్లిమెంటరీ ప్రాజెక్టుకు నిఽధులను సమకూర్చింది. ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం ఏమిటంటే, డ్యూయల్‌ వొకేషనల్‌ శిక్షణ కోసం కార్పోరేట్‌ బ్లూ ప్రింట్‌ను అభివృద్ధి చేయడం. తదనంతర కాలంలో దీనిని ఇతర క్లస్టర్లకు విస్తరించవచ్చు.

ఎన్‌ఎస్‌డీసీఐ ఇటీవలనే 16 దేశాలలో (2022–2027) వర్క్‌ఫోర్స్‌ డిమాండ్‌ను విశ్లేషించేందుకు ఓ అధ్యయనం నిర్వహించింది. సమీప భవిష్యత్‌లో జర్మనీలో నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తి కొరత అతి పెద్ద సవాల్‌గా నిలువనుంది. విభిన్న పరిశ్రమలలో అభివృద్ధి చెందుతున్న ధోరణులను ఒడిసిపట్టుకునేందుకు అంతర్జాతీయ స్కిల్‌ మ్యాపింగ్‌ ఆవశ్యకతను ఇది వెల్లడించింది. తయారీ,ఆరోగ్య సంరక్షణ, హోల్‌సేల్‌, రిటైల్‌, సైన్స్‌ ,ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, కన్‌స్ట్రక్షన్‌ రంగాల్లో నైపుణ్యవంతులైన కార్మికుల కోసం డిమాండ్‌ ఉండనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News