Saturday, November 23, 2024

స్విస్‌నుంచి భారత్‌కు నాలుగో ఖాతాల చిట్టా

- Advertisement -
- Advertisement -

India gets fourth set of Swiss bank account details

వందలాది అకౌంట్లు ..కొందరిపేరిట అనేకం

బెర్నె / న్యూఢిల్లీ : స్విస్‌బ్యాంక్ ఖాతాలున్న భారతీయుల, సంస్థల వివరాల నాలుగో జాబితా ఇప్పుడు స్విట్జర్లాండ్ నుంచి భారత ప్రభుత్వానికి అందింది. వార్షిక సమాచార వినిమయం ఒడంబడిక పరిధిలో ఈ సమాచారం పంపించారు. తమ దేశ బ్యాంకుల ఖాతాల వ్యవహారాల పారదర్శకతను చాటుకునే పద్ధతిలో భాగంగా స్విట్జర్లాండ్ 101 దేశాలకు సంబంధించిన 34 లక్షల ఆర్థిక లావాదేవీల ఖాతాల వివరాలను పంపిణీ చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు నాలుగో విడత సమాచారం పంపిణీ చేసింది. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. భారతదేశానికి సంబంధించినంత వరకూ వందలాది అకౌంట్స్ వివరాలు ఇప్పుడు ప్రభుత్వానికి అందాయి. వీటిలో కొన్ని బహుళ స్థాయి అకౌంట్లు ఉన్నాయి. వీటిని కొందరు వ్యక్తులు, కార్పొరేట్లు, ట్రస్టులు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. అయితే ఇంతకు ముందటిలాగానే ఇప్పుడు కూడా ఖాతాదార్ల పేర్లను ఇతర వివరాలను వెల్లడించలేదు. సమాచార వినిమయ ఒప్పందంలోని గోప్యత అంశానికి అనుగుణంగా వ్యవహరించారని వెల్లడైంది.

తదుపరి దర్యాప్తులు అవసరం అయితే ఎటువంటి ప్రభావం పడకుండా చేసేందుకు ఈ విధమైన జాగ్రత్తకు దిగారు. అయితే ఆయా దేశాలలో పన్నుఎగవేతలు, ఆర్థిక అక్రమలావాదేవీలు, మనీలాండరింగ్ వ్యవహారాలకు దిగే వారిపై దర్యాప్తునకు ఈ సమాచారం బాగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి ఉగ్రనిధులను చేరవేసే లేదా వీటి లావాదేవీలకు దిగే వారి పాత్రను కనుగొనేందుకు ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఖాతాల విషయాలు ఉపయుక్తం అవుతాయి. ఈ ఏడాది సమాచార పంపిణీలో తాము కొత్తగా మరో ఐదు దేశాలను ఈ జాబితాలో చేర్చామని ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టిఎ)తెలిపింది. అల్బేనియా, బ్రూనీ దారుసలాం, నైజిరియా, పెరూ,టర్కీల పేర్లను ఈ జాబితాలో చేర్చారు. వరుసగా నాలుగోసారి కూడా భారతదేశానికి చెందిన ఖాతాల వివరాలనే అత్యధికంగా పొందుపర్చారని వెల్లడైంది. స్విట్జర్లాండ్‌తో 2019 సెప్టెంబర్‌లో ఇండియా ఆటోమోటిక్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ (ఎఇఒఐ) అవగావహనకు వచ్చింది. ఈ క్రమంలో వరుసగా స్విస్ బ్యాంక్ ఖాతాల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News