Saturday, November 23, 2024

భారత్ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ హైపర్ కారు ’ఏకాంక్’

- Advertisement -
- Advertisement -

Ekonk hyper car

న్యూఢిల్లీ: పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో నిర్మించిన ‘ఏకాంక్’ ఎలక్ట్రిక్ హైపర్ కారు భారత్‌కు సాధ్యమైంది. ఈ కారును ఫైబర్‌తో నిర్మించడం వల్ల బరువు కూడా తక్కువగా ఉంటుంది. దీని పవర్ అవుట్‌పుట్ 722 హెచ్‌పి. ఏకాంక్ వినూత్న బ్యాటరీని వాడుతుంది. ఇది సాంప్రదాయిక కాంప్లెక్స్ లిక్విడ్ కూలింగ్ టెక్నిక్‌కు బదులుగా వాడబడుతుంది. ఎలక్ట్రిక్ హైపర్‌కారు ఏకాంక్ టాప్ స్పీడ్ గంటకు 309 కిమీ.

ఇండియన్ ఇవి స్టార్టప్ వజీరాని ఆటోమోటివ్ ఫాస్టెస్ట్ సింగిల్ సీటర్ హైపర్‌కారు ఏకాంక్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇది ప్రపంచంలోని వేగవంతంగా వెళ్లే కారుల్లో ఒకటని కూడా తెలిపింది. ఓడలా ఉండే ఈ కారు మొత్తంగా 738 కిగ్రా. ఉంటుంది. ఈ హైపర్‌కారు గురించి ఇంగ్లాండ్‌లని గుడ్ ఫెస్టివల్‌లో తెలుపడం జరిగింది. భారతీయ పురాణం ప్రకారం ‘ఏకాంక్’ అంటే ‘దైవిక కాంతి ఆరంభం’ అర్థం. “ఎలక్ట్రిక్ కారుల విషయంలో అన్వేషణలకు భారత్‌కు ఇది సరైన అదను. ఎలక్ట్రిక్ వెహికిల్ యుగంలో మార్గనిర్దేశకులుగా, అభివృద్ధికారకులం అవుదాం’ అని వజీరాని ఆటోమేటివ్ సిఇఒ, వ్యవస్థాపకుడు చంకీ వజీరాని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News