- Advertisement -
న్యూఢిల్లీ/బెర్నే: స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల ఖాతాల వివరాలకు సంబంధించిన మూడో సెట్‌ను భారత్‌కు అందించినట్టు ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్టిఎస్విట్జర్లాండ్) ఓ ప్రకటనలో తెలిపింది. స్విట్జర్లాండ్‌తో జరిగిన ఒప్పందం మేరకు ప్రతి ఏటా భారత్‌కు ఆటోమేటిక్‌గానే ఖాతాల వివరాలను అందిస్తున్నారు. 96 దేశాలకు సంబంధించిన దాదాపు 33 లక్షల ఖాతాల వివరాలను షేర్ చేసుకున్నట్టు ఎఫ్‌టిఎ తెలిపింది. స్విట్జర్లాండ్‌లోని భారతీయుల ఖాతాల మూడో విడత వివరాల్ని సెప్టెంబర్‌లోనే అందజేసినట్టు ఎఫ్‌టిఎ తెలిపింది. 2019 సెప్టెంబర్‌లో మొదటిసారి స్విస్ బ్యాంక్‌ల్లోని భారతీయుల ఖాతాల వివరాల్ని ఆ దేశం అందించింది.
- Advertisement -