భారీ భూకంపంతో కుదేలైపోయిన మయన్మార్ భారత ప్రభుత్వం ఉదారంగా పెద్దఎత్తున సాయం అందిస్తోంది. వారం రోజుల్లో ఏకంగా 447 మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలతో పాటు భారీ ఎత్తున రిస్క్యూ టీమ్ లను పంపడంలో ముందు వరుసలో నిలిచింది. మయన్మార్ లో మార్చి 28న భారీగా 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 3,100 మందికి పైగా మరణించారు. ఇంకా వందలాదిమంది ఆస్పత్రుల్లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. మయన్మార్ లో భారత్ ఆపరేషన్ బ్రహ్మ కింద చేపట్టిన మానవతా సహాయంలో భాగంగా ఆహారం, దుస్తులు, దుప్పట్లు,, మందులు పంపింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు పెద్దసంఖ్యలో రిస్క్యూ టీమ్ లనూ భూకంపం సంభవించిన మర్నాడే.. అన్ని దేశాల కన్నా ముందుగా అందజేసింది.
మహన్మార్ దక్షిణ ప్రాంతంలోని తిలానా ఔడరేవుకు భారత నౌకాదళం నౌకద్వారా 442 మెట్రిక్ టన్ను ల ఆహారపదార్థులు చేరుకున్నాయి. అంతకు ముందు విమానంలో మరో ఐదు టన్నుల ఆహార పదార్థాలు పంపారు.విశాఖ పట్నం పోర్ట్ నుంచి ఏప్రిల్ 1న బయలుదేరిన నౌకలో 442 టన్నుల ఆహార పదార్థాలలో 405 టన్నుల బియ్యం, 30 టన్నుల వంట నూనెలు, 5 మెట్రిక్ టన్నుల బిస్కెట్లు, 2 టన్నుల ఇన్ స్టెంట్ నూడుల్స్, ఇతర సహాయ సామగ్రి ఉన్నాయి. శుక్రవారం భారతదేశంతోపాటు క్వాద్ భాగస్వామ్య దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా కలిసి , 20 మిలియన్ల అమెరికా డాలర్లకుంటే ఎక్కువ సహాయాన్ని అందించాయి. మరింతగా మానవతా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చాయి.