ఐఎంఎఫ్ ఆర్థికవేత్త గీతాగోపీనాథ్
న్యూఢిల్లీ : భారతదేశంలో ఇప్పటికీ 50 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయింది. అయితే ఇప్పటికీ కరోనా థర్డ్‌వేవ్ ముప్పు మిగిలే ఉంది. ఈ విషయాన్ని ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీకాల విషయంలో ఇండియా ముందంజలో ఉంది. ఆత్మస్థయిర్యం సంతరించుకుంది. పలు దేశాలు వ్యాక్సిన్లపై కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే ఇండియాలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునే ఏర్పాట్లు జరిగినా పలు ఇతరకారణాలతో తిరిగి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదని గీతా గోపీనాథ్ చెప్పారు. సామూహిక జనజీవిత పరిణామాలు థర్డ్‌వేవ్‌కు దారితీసే విధంగా మారుతాయి. అయితే వచ్చే వారం ఏ రోజున అయినా ఇండియాలో వందకోట్ల టీకాల లక్షం పూర్తవుతుంది.అత్యధిక జనాభా గల భారతదేశంలో టీకాల పట్ల జనం సానుకూలత సత్ఫలితాలకు దారితీసింది. దీనితో ఆర్థిక వ్యవస్థ గాడీలో పడుతుంది. ఇదే అమెరికాలో వ్యాక్సిన్లపై జనం అనాసక్తి , తటపటాయింపులతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని ఆమె విశ్లేషించారు.