న్యూఢిల్లీ: కరోనా సోకినా భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు 14.19 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. కోవిడ్ బాధితులు వైద్యుల సలహా మేరకే ఆస్పత్రుల్లో చేరాలని సూచించింది. చాలామంది భయాందోళనలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారని పేర్కొంది. కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే భౌతికదూరం, మాస్కు నిబంధనలు తప్పనిసరి పాటించాలని ఆదేశించింది. కరోనా బాధితులు కచ్చితంగా బౌతికదూరం పాటించాలని కేంద్రం ప్రభుత్వం హెచ్చిరించింది. భౌతికదూరం పాటించని రోగి నుంచి నెలరోజుల్లో 406 మందికి వైరస్ సోకిందని తెలిపింది. ఇంట్లోనూ మాస్కులు ధరించాల్సిన సమయం వచ్చిందని చెప్పింది. దేశంలో ప్రస్తుతం తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉంది. ఆక్సిజన్ రవాణాలో సవాళ్లు ఎదురవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
India has enough stock of medical oxygen