Monday, March 10, 2025

రెండో వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టుకు ఓపెనర్లు  రోహిత్ శర్మ,శుభమన్ గిల్  దూకుడుగా ఆడారు. వీరిద్దరూ కలిసి 105 పరుగుల భాగస్వామ్యం చేశారు. రోహిత్ శర్మ 41 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో రోహిత్ కి ఇది 58 వ హాఫ్ సెంచరీ.నిలకడగా ఆడుతున్న భారత్ వెనువెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. 105 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. శుభమన్ గిల్(31) ఔటయ్యాడు. 18.4 ఓవర్లో శాంట్నర్ వేసిన బంతిని గ్లెస్ గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టడంతో గిల్ పెవిలియన్ చేరాడు.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(1) 19.1 ఓవర్లలో బ్రాస్ వెల్ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News