Sunday, November 17, 2024

భారత్ లోనే కొవిడ్ మరణాలు తక్కువ

- Advertisement -
- Advertisement -

India has lowest 374 COVID-19 deaths

ప్రతి పది లక్షల జనాభాకు 374 మంది మృతి చెందారన్న ఆరోగ్యశాఖ

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మృతుల సంఖ్య అధికారిక లెక్కల కంటే మరింత ఎక్కువగా ఉండవచ్చంటూ అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ప్రతి పది లక్షల జనాభాకు 374 మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న అమెరికా బ్రెజిల్ , రష్యా, మెక్సికో దేశాలతో పోలిస్తే కొవిడ్ మరణాల రేటు భారత్ లోనే తక్కువని పేర్కొంది. కొవిడ్ మరణాలు అధికంగా ఉన్నాయంటూ వస్తోన్న వార్తలపై రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది.

“ ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రతి పది లక్షల మందికి (374 మరణాలు) అతి తక్కువ కొవిడ్ మరణాలు చోటు చేసుకున్న దేశాల్లో భారత్ ఒకటి. అమెరికాలో ప్రతి పది లక్షల మందికి 2920 మరణాలు చోటు చేసుకోగా, బ్రెజిల్‌లో 3092, రష్యాలో 2506.మెక్సికోలో 2498,మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఆయా దేశాలతో పోలిస్తే భారత్‌లో కొవిడ్ మరణాల రేటు చాలా తక్కువ” అని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు. కొవిడ్ మరణాలకు సంబంధించి మే 10,2020 న భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిందన్న ఆమె, వాటిని నమోదు చేసేందుకు పాటించాల్సిన నిబంధనలపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News