Monday, December 23, 2024

దేశంలో ఓటర్ల సంఖ్య సుమారు 97 కోట్లు

- Advertisement -
- Advertisement -

ఎన్నికల కమిషన్ వెల్లడి
2019లో కన్నా 6 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ : ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలలో వోటు వేయడానికి సుమారు 97 కోట్ల మంది అర్హులని ఎన్నికల కమిషన్ (ఇసి) శుక్రవారం వెల్లడించింది. 18, 29 ఏళ్ల మధ్య వయో వర్గంలో రెండు కోట్ల మందికి పైగా యువ వోటర్ల పేర్లను వోటర్ల జాబితాలో చేర్చినట్లు ఇసి తెలియజేసింది. చివరి సారిగా లోక్‌సభ ఎన్నికలు జరిగిన 2019లోని రిజిస్టర్ అయిన వోటర్ల సంఖ్య కన్నా ఇప్పుడు ఆరు శాతం పెరుగుదల నమోదైంది.

‘ప్రపంచంలోనే భారత్‌లో అత్యధిక సంఖ్యలో ఉన్న వోటర్లు 96.88 కోట్ల మంది రానున్న సార్వత్రిక ఎన్నికలలో వోటు వేయడానికి పేర్లు నమోదు చేసుకున్నారు’ అని ఇసి వివరించింది. లింగ దామాషా 2023లోని 940 నుంచి 2024లో 948కి పెరిగిందని ఇసి తెలిపింది. వోటర్ల జాబితాల సవరణలో పారదర్శకత, వివరాల వెల్లడితో పాటు జాబితాల స్వచ్ఛత, లోపరహితానికి కమిషన్ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని కమిషన్ అధికారి ఒకరు తెలిపారు. వోటర్ల జాబితాల సవరణకు సంబంధించ వివిధ బాధ్యతలు, ప్రతి దశలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం గురించి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పుణెలో విలేకరుల గోష్ఠిలో వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News