Wednesday, December 18, 2024

భారత్‌లో 756 కొత్త కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 756 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాతో మరో ఎనిమిది మంది బాధితులు మరణించినట్లు పేర్కొంది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4.49కోట్లు దాటింది.

దేశంలో ఇప్పటివరకు 4.44కోట్లకు పైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్-19తో ఇప్పటివరకు దేశంలో 5,31,832 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 8,115కి తగ్గాయి. కాగా, మొత్తం రికవరీ రేటు 98.80 శాతానికి చేరుకోగా.. మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. ఇక, దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News