Sunday, December 22, 2024

చైనా వద్దకు మేము విషయాన్ని తీసుకెళ్లాము!

- Advertisement -
- Advertisement -
India has taken up matter of torture of Arunachal teen
అరుణాచల్ అబ్బాయిపై దాష్టికంపై విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ: చైనా సైన్యం కస్టడీలో అరుణాచల్ అబ్బాయిని హింసించిన విషయాన్ని చైనా వద్దకు తీసుకెళ్లినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం స్పష్టంచేసింది. “మేము విషయాన్ని చైనా వద్దకు తీసుకెళ్లాము” అని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం మీడియా బ్రీఫింగ్ సందర్భంగా తెలిపారు. ఈ విషయంపై అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ, “ జనవరి 18న అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న లుంగ్తా జోర్ ప్రాంతం నుంచి మిరం తరోన్(17)ను చైనా సైన్యం అపహరించుకుపోయింది. అప్పుడతడు తన మిత్రుడు జానీ యాయింగ్‌తో కలిసి వేటాడుతున్నాడు. అయితే జానీ యాయింగ్ ఎలాగోలా చైనా సైనికులకు చిక్కకుండా తప్పించుకుని భారత అధికారులకు వివరాలు తెలిపాడు”.

కాగా చైనా సైన్యం జనవరి 27న అంజ్వా జిల్లా లోని కిబిథులో ఉన్న వాచాదామై ఇంటరాక్షన్ పాయింట్ వద్ద మిరంను భారత సైన్యానికి అప్పగించింది. తన కుమారుడిని నిర్బంధంలో చైనా సైనికులు కళ్లకు గంతలు కట్టి, తన్నారని, అంతేకాక కరెంటు షాక్ కూడా ఇచ్చారని మిరం తరోన్ తండ్రి ఒపాంగ్ తరోన్ తెలిపారు. పార్లమెంటులో చైనా, పాకిస్థాన్‌లు ఒక్కటయ్యాయి అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు బాగ్చీ నిరాకరించారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ దీనిపై ఇప్పటికే వివరణ ఇచ్చారన్నారు. ఇదిలా ఉండగా “చరిత్ర పాఠాలు తెలుసుకుని ఏదైనా వ్యాఖ్యానించాలి” అని జైశంకర్ అన్నారు. “ఇదివరలో పాక్, చైనాలు ఏమైనా దూరంగా ఉన్నాయా?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొండి అంటూ జైశంకర్ , రాహుల్ గాంధీకి చురక అంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News