Wednesday, January 22, 2025

బోనులో విదేశాంగ విధానం!

- Advertisement -
- Advertisement -

Russia expects India’s support on UNSC resolution

గత కొంతకాలంగా భారత్‌కు విదేశాంగ విధానం అంటూ లేకపోయిందని, కేవలం స్వదేశీ రాజకీయ అవసరాలకు అదొక్క మార్గంగా మాత్రమే చూస్తున్నారని ఒక ప్రముఖ దౌత్యవేత్త ఈ మధ్య వ్యాఖ్యానించారు. మన విదేశాంగ విధానంలో ఎటువంటి చొరవలు లేకపోగా, సంక్షోభ పరిష్కార ప్రయత్నాలే ఉంటున్నాయి. ఉదాహరణకు చైనా ఆక్రమించిన మన భూభాగాలలో నిర్మాణాలు చేబడుతున్నదని ఆరోపణలు వస్తే మాట్లాడే సాహసం చేయడం లేదు. గాల్వన్ లోయ వద్ద చైనాతో జరిగిన ఘర్షణలు అసలు ఏమి జరిగిందే చెప్పే ధైర్యం చేయడం లేదు. మన సైనికులు వీరోచితంగా పోరాడి, చైనాకు కోలుకోలేని దెబ్బ తీసినా, ఆ తర్వాత దౌత్యపరంగా మనం చెప్పుకోదగిన ప్రగతి సాధింపలేక పోతున్నాము. చైనాతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నివారణకు సహితం రష్యా చొరవ తీసుకోవడం తెలిసిందే. మన రక్షణ, విదేశాంగ మంత్రులు రష్యాకు వెళ్లి, అక్కడ రష్యా నేతల సమక్షంలో చైనా మంత్రులతో సమాలోచనలు జరపడం జరిగింది.

మొత్తం ప్రపంచం భయపడుతున్నట్లుగానే రష్యా ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం చేపట్టింది. ఇప్పటికే కరోనా మహమ్మారితో ఆర్ధికంగా, సామాజికంగా అతలాకుతలమైన ప్రపంచ ప్రజలకు ఈ పరిణామం ఒక విధంగా పిడుగుపాటు వంటిదే. ఇది కేవలం ఆ రెండు దేశాలకు సంబంధించిన అంశం కాబోదు. పరిణామాలు మొత్తం ప్రపంచంపై ఉంటాయనడానికి ఆ తర్వాతి పరిణామాలు వెల్లడి చేస్తున్నాయి. మూడు చమురు ధరలు భగ్గుమనడం దగ్గర నుండి, తెలుగు రాష్ట్రాలలో ఈ ఘర్షణతో ఏమీ సంబంధం లేకపోయినా వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారత దేశపు విదేశాంగ విధానం మరోసారి ప్రశ్నార్థకరంగా మారింది. ఇప్పుడే కాదు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి మన విదేశాంగ విధానంపై స్వదేశీ రాజకీయ ప్రయోజనాలు తప్ప, వాస్తవికత లోపిస్తున్నట్లు కనబడుతున్నది. ఇతరత్రా మనతో దేనిలోనూ పోటీ పడలేని పొరుగు దేశం పాకిస్థాన్ మాత్రం విదేశాంగ విధానంలో విజయవంతంగా అడుగులు వేస్తూ వస్తున్నది.

రష్యా దురాక్రమణ ప్రారంభమైన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడిన మొదటి దేశాధినేతగా మన ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకోవడం హర్షణీయమే. అయితే భారత ప్రభుత్వ ఆందోళన ఈ సమయంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తీసుకురావడం మినహా అంతకు మించి ఉండే అవకాశం లేదు. ప్రధాని కార్యాలయం చెబుతున్నట్లు ఉక్రెయిన్‌పై దాడులు వెంటనే ఆపి, చర్చల ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నించామని పుతిన్‌కు భారత్ సూచించారనడం కొంచెం అతిశయోక్తి గానే ఉంటుంది. వాస్తవానికి రష్యాకు భారత్‌తో ఉన్న మిత్రత్వం బహుశా మరే దేశంతో లేదు. అగ్రరాజ్యంగా ప్రపంచాన్ని నిర్దేశించే ప్రయత్నం చేస్తూ పాకిస్థాన్‌తో జత కట్టి భారత్ పట్ల చిన్నచూపు చూస్తున్న అమెరికా పట్ల ధిక్కార ధోరణితో వ్యవహరిస్తూ 1971 భారత్ – బంగ్లా యుద్ధంలో భారత్‌ను కట్టడి చేయడానికి విఫల ప్రయత్నాలు చేసిన ఆ దేశం నుండి రక్షణ కోసం చాలా ముందు చూపుతో ఇందిరా గాంధీ రష్యాతో రక్షణ ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుండి అన్ని విపత్కర పరిస్థితులలో రష్యా మనకు అండగా నిలబడుతూ వస్తున్నది. అమెరికా ఎప్పుడు తన వాణిజ్య ప్రయోజనాల కోసం, భారత్ లోని మార్కెట్‌ల నుండి ప్రయోజనం పొందాలనే తాపత్రయం తప్ప ఏ విషయంలో కూడా భారత్‌కు అండగా నిలబడిన దాఖలాలు లేవు. అయితే ఆర్ధిక సంస్కరణల నేపథ్యంలో పలు కారణాల చేత భారత్ అమెరికాకు దగ్గర కావలసి వచ్చింది. అయినా రష్యాతో మన సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి.

కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోడీ జరిపిన ‘వ్యక్తి గత స్నేహం’ భారత్ కు చెప్పుకోదగిన ప్రయోజనాలు కలిగించలేకపోయినా అంతర్జాతీయంగా పలు సమస్యలను మాత్రం కలిగిస్తూ వస్తున్నది. ఇప్పుడు రష్యా నమ్మడం లేదు. చివరకు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా విశ్వసించడం లేదు. గత నవంబర్‌లో ఆరు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ వైట్ హౌస్‌లో ప్రతికూల వాతావరణం గమనించి మూడు రోజులకే తిరిగి రావడం చూసాము. ట్రంప్‌కు అహ్మదాబాద్‌లో ఘనంగా పౌర సత్కారం చేయడం ద్వారా ఆయన అమెరికాలో భారతీయ ఓటర్లను, మోడీ భారత్ లో అమెరికా అనుకూల మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు ఏమై యాయో గాని కరోనా మహమ్మారి విషమించేందుకు మాత్రం దారితీసింది. విదేశాంగ విధానంలో నిర్ణయాత్మకమైన దౌత్యప్రక్రియలను అనుసరించాలి. అంతేగాని వివిధ దేశాధినేతలతో కౌగిలింతల ఫోటోలతో భారత్ కు ఒరిగేది ఏమీ లేదని ఇప్పటికైనా భారత ప్రభుత్వం గమనించాలి. గత కొంతకాలంగా భారత్‌కు విదేశాంగ విధానం అంటూ లేకపోయిందని, కేవలం స్వదేశీ రాజకీయ అవసరాలకు అదొక్క మార్గంగా మాత్రమే చూస్తున్నారని ఒక ప్రముఖ దౌత్యవేత్త ఈ మధ్య వ్యాఖ్యానించారు. మన విదేశాంగ విధానంలో ఎటువంటి చొరవలు లేకపోగా, సంక్షోభ పరిష్కార ప్రయత్నాలే ఉంటున్నాయి. ఉదాహరణకు చైనా ఆక్రమించిన మన భూభాగాలలో నిర్మాణాలు చేబడుతున్నదని ఆరోపణలు వస్తే మాట్లాడే సాహసం చేయడం లేదు. గాల్వన్ లోయ వద్ద చైనాతో జరిగిన ఘర్షణలు అసలు ఏమి జరిగిందే చెప్పే ధైర్యం చేయడం లేదు. మన సైనికులు వీరోచితంగా పోరాడి, చైనాకు కోలుకోలేని దెబ్బ తీసినా, ఆ తర్వాత దౌత్యపరంగా మనం చెప్పుకోదగిన ప్రగతి సాధింపలేక పోతున్నాము.

చైనాతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నివారణకు సహితం రష్యా చొరవ తీసుకోవడం తెలిసిందే. మన రక్షణ, విదేశాంగ మంత్రులు రష్యాకు వెళ్లి, అక్కడ రష్యా నేతల సమక్షంలో చైనా మంత్రులతో సమాలోచనలు జరపడం జరిగింది. నేడు గతంలో ఎన్నడూ లేనంతగా రష్యా, చైనా దగ్గరకు వస్తున్నాయి. అఫ్ఘానిస్తాన్ పరిణామాలు సహజంగానే వీటికి బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటివరకు అమెరికా ఏజెంట్‌గా వ్యవహరించిన పాకిస్థాన్ చైనాతో కూడా సన్నిహితంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు చైనా ద్వారా రష్యాకు దగ్గర కావాలని ప్రయత్నం చేస్తున్నది. ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభించడానికి ముందు రోజే పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ రష్యాలో అడుగుపెట్టడం గమనార్హం. గత 20 ఏళ్లలో పాకిస్థాన్ అధినేత రష్యా పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. మన విదేశాంగ విధానంలో అమెరికా ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. ముఖ్యంగా అఫ్ఘానిస్తాన్ విషయంలో అమెరికాను గుడ్డిగా నమ్మి, తాలిబన్లను నిర్లక్ష్యం చేయడంతో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాము. అమెరికా మెప్పుకోసం అన్నట్లుగా అఫ్ఘానిస్తాన్ లో మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు ఖర్చు పెట్టిన భారత్‌తో తాలిబన్లతో రాజీ చర్చల గురించి ఎటువంటి సమాచారం పంచుకొనకపోవడం గమనార్హం. పైగా, అమెరికా సైనికులపై తప్ప అఫ్ఘానిస్తాన్ కోసం ఏమీ ఖర్చు చేయలేదు. నేడు అంతర్జాతీయంగా అమెరికా ఆధిపత్య ధోరణులకు కాలం చెల్లినట్లేనని అఫ్ఘాన్ పరిణామాలతో పాటు ఉక్రెయిన్ పరిణామాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఈ వాస్తవాన్ని ముందుగానే గ్రహించిన డోనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ అంటూ అంతర్జాతీయ అంశాలపై అనాసక్తి చూపుతూ వచ్చారు. ఆ విధంగా ఆయన అమెరికా ప్రయోజనాలు కాపాడడం కోసం కృషి చేశారని చెప్పవచ్చు.

కానీ విశేష పరిపాలన అనుభవం ఉన్నాడని భావించిన జో బైడెన్ వ్యవహారం అగమ్యగోచరంగా ఉంటూ వస్తున్నది. మీడియాలో హుంకరింపులు తప్ప ఆచరణ ఉండడం లేదు. అందుకనే వీరందరిని నమ్ముకొని తాను మునిగిపోయాను అన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వాపోవడం చూస్తున్నాము. నేడు పూర్వపు సోవియట్ యూనియన్ ప్రాంతంలో పెద్ద పోలీస్‌గా వ్యవహరించే ప్రయత్నం పుతిన్ చేస్తున్నారు. ఆయన ఉద్దేశాలు కేవలం రష్యా రక్షణ సంబంధిత అంశాలే కాకుండా, విస్తరణ ఆకాంక్షలు కూడా వెల్లడి చేస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభం కేవలం ఉక్రెయిన్, ఐరోపా, అమెరికాలకే కాకుండా రష్యాకు కూడా భారీగా నష్టం కలిగించే అవకాశం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత భయంకర పరిస్థితులకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాలు యుద్ధం లో పాల్గొనే అవకాశాలు లేకపోయినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వాటిపై ప్రభావం ఉండక తప్పదు.

భారత్ స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరిస్తూ ఉంటె ప్రపంచంలో ఒక పెద్దరికం స్థాయి ఇప్పుడు మనకు దక్కి ఉండెడిది. రాజకీయంగా, సాంస్కృతికంగా, వాణిజ్యపరంగా కూడా మనకు ఉక్రెయిన్ కూడా ఎంతో ముఖ్యమైన దేశం. కాబట్టి రష్యా, ఉక్రెయిన్ ల మధ్య వారధిగా భారత్ ఉండే అవకాశం యేర్పడెడిది. కానీ తగిన దూరదృష్టి లేకుండా, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మారుతూ ఉండడంతో భారత్ ఒక విధంగా ఒక సువర్ణావకాశాన్ని జారవిడుచుకొన్నట్లు చెప్పవచ్చు. లోపభూయిష్టమైన విదేశాంగ విధానం కారణంగానే మనం అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ మధ్య అఫ్ఘానిస్తాన్ నుండి హిందూ, సిక్కు ప్రతినిధులు వచ్చి కలసినప్పుడు వారి కోసమే భారత ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు తీసుకొచ్చిందని ప్రధాని మోడీ చెప్పారు. గత ఏడాది ఆగస్టులో అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సమయంలో సహితం మన కేంద్ర మంత్రి హరిదీప్‌సింగ్ పూరి సహితం అదే విధంగా మాట్లాడారు. భారత్‌లోని ఓటర్లపై ప్రభావం చూపడం కోసం అటువంటి మాటలు వాడినట్లు భావించవచ్చు. వాస్తవానికి పౌరసత్వ సవరణ చట్టం అఫ్ఘానిస్తాన్‌లోని భారత సంతతి వారికి అసలు వర్తించదు. కేవలం పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలకు, అది కూడా చట్టంలో పేర్కొన్న గడువు లోగా భారత్ వచ్చిన వారికి మాత్రమే వర్తిస్తుంది. తాజాగా ఏ దేశం నుండి వచ్చినా వారికి వర్తించదు. అయినా ప్రధాని, విదేశాంగ అధికారిగా పని చేసిన పూరి వంటి వారు అటువంటి మాటలు మాట్లాడటం గమనిస్తే విదేశాంగ విధానం పట్ల వారికి గల ప్రాధాన్యతను వెల్లడి చేస్తుంది.

* చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News