Wednesday, January 22, 2025

అయోధ్య, సిఎఎ ప్రస్తావనపై పాక్ తీరును ఎండగట్టిన భారత్

- Advertisement -
- Advertisement -

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్‌జిఎ)లోశుక్రవారం అయోధ్య రామాలయం, పౌరసత్వసవరణ చట్టం (సీఎఎ ) గురించి పాక్ ప్రస్తావించడంపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తీవ్రంగా స్పందించారు. అరిగిపోయిన రికార్డులా చెప్పిందే చెప్పి విసుగుపుట్టించే చెత్త రికార్డు మీది అని రుచిరా కాంబోజ్ పాక్ రాయబారి మునిర్ అక్రమ్‌పై విరుచుకుపడ్డారు. ఈ ప్లీనరీ సమావేశంలో ఇస్లామోఫోబియాను నివారించే చర్యలపై పాకిస్థాన్ తీర్మానం ప్రవేశ పెట్టగా, ఐరాస సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా పాక్ రాయబారి అయోధ్యరామాలయ ప్రతిష్ట, పౌరసత్వ సవరణ చట్టం గురించి ప్రస్తావించారు. దీనిపై రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ “ నా దేశానికి సంబంధించిన విషయాలపై ఈ ప్రతినిధి బృందం సంకుచిత,

తప్పుదోవ పట్టించే దృక్పథాన్ని కలిగి ఉండడం దురదృష్టకరం. అలాగే ఈ జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ స్థాయి కలిగిన లోతైన అంశాల గురించి పరిగణిస్తుంటే , మీ దగ్గర నుంచి భిన్నమైన వైఖరి కనిపిస్తోంది. ఎప్పుడూ చెప్పిందే చెప్పే చెత్త రికార్డు కలిగిన ఆ దేశ ప్రతినిధి బృందం ప్రపంచం పురోగమిస్తున్న తరుణంలో స్తబ్దుగా ఉండడం విచారకరం ” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తీర్మాన ఆమోదానికి సంబంధించి భారత్ వైఖరిని రుచిరా కాంబోజ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో 115 దేశాలు అనుకూలంగా మద్దతు ఇవ్వగా, ఎవరూ వ్యతిరేకించలేదు. భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఉక్రెయిన్, బ్రిటన్ తదితర 44 దేశాల సభ్యులు హాజరు కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News