Sunday, December 22, 2024

ఒలింపిక్స్ లో సెమీస్ చేరిన భారత హాకీ జట్టు

- Advertisement -
- Advertisement -

పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు సెమీస్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్‌లో బ్రిటన్‌పై హాకీ జట్టు ఘన విజయం సాధించడంతో సెమీస్‌లోకి అడుగుపెట్టింది. బ్రిటన్‌పై ఫెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది.

ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాగంలో క్వార్టర్స్‌లో భారత బాక్సర్ లవ్లీనా ఓటమిపాలయ్యారు. మహిళల 75 కిలో విభాగంలో బాక్సర్ లవ్లీనా ఓటమి చెందారు. చైనా బాక్సర్ లీ కియాన్‌పై 1-4 తేడాతో లవ్లీనా ఓటమిని చవిచూశారు.

బ్యాడ్మింటన్ సెమీస్‌లో లక్షసేన్ పరాజయం పాలయ్యారు. డెన్మార్క్ ఆటగాడు అక్సెల్సెన్ చేతిలో లక్షసేన్ ఓటమి చెందారు. సెమీస్‌లో 22-20, 21-14 తేడాతో లక్ష సేన్ ఓటమిని చవిచూశారు.

India hockey team enter into olympics

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News