Friday, December 27, 2024

భారత్ భారీగా పన్నులు విధించే దేశం:ట్రంప్

- Advertisement -
- Advertisement -

తాను అధికారంలోకి వచ్చినట్లయితే పరస్పర పన్ను విధానాన్ని ప్రవేశపెడతానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శపథం చేశారు. అన్ని పెద్ద దేశాల్లోకి భారత్ విదేశీ ఉత్పత్తులపై అత్యధిక చార్జీలు విధిస్తుంటుందని ట్రంప్ గురువారం ఆరోపించారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ డెట్రాయిట్‌లో ప్రధాన ఆర్థిక విధాన ప్రసంగం చేస్తూ, ‘అమెరికాను మళ్లీ అసాధారణ సంపన్న దేశం చేసేందుకు నా ప్లాన్‌లో అత్యంత ముఖ్యమైన అంశమేమంటే పరస్పర పన్ను. మనం సాధారణంగా టారిఫ్‌లు విధించం కనుక నా ప్లాన్‌లో అత్యంత ముఖ్యమైన పదం అది. నేను ఆ ప్రక్రియను ప్రారంభించాను, వ్యాన్లు, చిన్న ట్రక్‌లు మొదలైనవాటితో అది చాలా ఘనమైనది, మనం నిజంగా చార్జి చేయడం.

చైనా మనపై 200 శాతం టారిఫ్ విధిస్తుంటుంది. బ్రెజిల్ భారీ పన్ను విధించే దేశమే. అయితే అన్నిటిలోకి అతి పెద్ద పన్ను విధించే దేశం భారత్’ అని చెప్పారు. ‘భారత్ అతిపెద్ద పన్ను వసూలు దేశం. భారత్‌తో మనకు గొప్ప సంబంధం ఉంది. నేను చేశాను. ముఖ్యంగా పెద్ద నేత మోడీ. ఆయన గొప్ప నాయకుడు. గొప్ప మనిషి. నిజంగా గొప్ప మనిషి. ఆయన గొప్ప పని చేశారు. అయితే, వారు బహుశా ఎక్కువగా చార్జి చేస్తుంటారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘వారు అనేక విధాలుగా చైనా కన్నా అధికంగా చార్జి చేస్తుంటారు. అయితే, వారు ఆ పని నవ్వుతూ చేస్తుంటారు‘ అని ట్రంప్ డెట్రాయిట్ ఎకనామిక్ క్లబ్ సభ్యులతో చెప్పారు. ఈ వారం ఆరంభంలో భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు చేసిన ట్రంప్ గురువారం ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News