Friday, December 20, 2024

ప్రపంచ టాప్ 10 పర్యాటక ప్రదేశాల్లో భారత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రంపంచంలోని టాప్ 10 పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా భారత్ అవతరించిందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈటి వరల్డ్ లీడర్స్ ఫోరమ్ లో మాట్లాడుతూ ఆయన ఈ కీలక వ్యాఖ్య చేశారు. దేశీయ పర్యాటక రంగం టాప్ కు వెళుతుందన్నారు. గతంతో పోలిస్తే పెట్టుబడులు పెరుగుతున్నాయన్నారు. ఇక్కడి సంస్కృతి తెలుసుకోవాలని విదేశీయులు ఉత్సాహపడుతున్నారని అన్నారు. భవిష్యత్తులో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఇంటర్నెట్ లో భారత పర్యాటక ప్రాంతాలను సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య కూడా 48 శాతం పెరిగిందన్నారు. ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన దేశంగా భారత్ ఎదగడానికి మన సంస్కృతి తోడ్పడుతోందని షెకావత్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News