Thursday, January 23, 2025

రాజ్యాంగం స్పూర్తితో భారత్ శక్తివంతంగా తయారవుతోంది : బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగం స్పూర్తితో భారత్ శక్తివంతంగా తయారవుతోందని బిజెపి రాష్ర్ట అధ్యక్షులు బండి సంజయ్ పేర్కోన్నారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాజ్యంగానికి విరుద్ధంగా పాలన సాగుతోందని విమర్శించారు.

రాజ్యాంగం , గవర్నర్ పట్ల కెసిఆర్ ప్రభుత్వానికి గౌరవమే లేదని, గణతంత్ర వేడుకలు నిర్వహించాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేదని తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని రాజ్యాంగాన్ని అవమనించి సిఎం కెసిఆర్ కు భారతదేశంలో ఉండే హక్కు లేదని బండి సంజయ్ అన్నారు. దేశాన్ని అసహ్యించుకుని పక్క దేశాలకు వంతపాడే వ్యక్తి కెసిఆర్ అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం తెలంగాణ కోసం బిజెపి పోరాడుతుందని బండి సంజయ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News