Monday, December 23, 2024

ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా భారత్ : ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

India is fifth economic power in the world: PM Modi

ఎనిమిదేళ్లలో 3 కోట్ల ఇళ్లు నిర్మించాం

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దేశంలోని పేద ప్రజల కోసం గడచిన ఎనిమిదేళ్లలో మూడు కోట్ల ఇళ్లు నిర్మించామని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. వీటిలో 10 లక్షల ఇళ్లు ఒక్క గుజరాత్ లోనే ఉన్నాయన్నారు. సూరత్ నగరంలో మెగా మెడికల్ క్యాంపును వర్చువల్‌గా మోడీ ప్రారంభించారు. గుజరాత్ లో 97 శాతం కుటుంబాలకు కుళాయి నీళ్లు అందుతున్నాయన్నారు. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటివరకు రూ. 2 లక్షల కోట్లను దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామన్నారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతోన్న భారత్, ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం మామూలు ఘనత కాదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News