ఢాకా: బంగ్లాదేశ్‌లో 12వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా ఢాకాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. భారత్ వంటి నమ్మకమైన దేశం మిత్ర దేశం ఉండడంతో మాకు చాలా అదృష్టమని ప్రశంసించారు. బంగ్లాదేశ్ విముక్తిలో భారత్ మాకు అండగా ఉందని గుర్తు చేశారు. 1975లో మా కుటుంబం మొత్తానికి ఆశ్రయిం ఇచ్చారని, ఇందుకు భారత ప్రజలకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. 2009 నుంచి 2023 వరకు అధికారంలో ఉండడంతోనే బంగ్లాదేశ్ అభివృద్ధి చెందిందని తెలిపారు. బంగ్లా సార్వభౌమ, స్వాతంత్య్ర దేశమని, ప్రజలు ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షిస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా సాగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటేసి వాతావరణం కల్పించామని హసీనా వివరించారు. ప్రధాని ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బిఎన్‌పి) ఎన్నికలను బహిష్కకరించడంతో బిఎన్‌పిని ఉగ్రవాద సంస్థగా ముద్రించింది. బిఎన్‌పి ఈ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో బంగ్లాదేశ్‌లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
భారత్ మాకు మిత్రదేశంగా ఉండడం అదృష్టం: హసీనా
- Advertisement -
- Advertisement -
- Advertisement -