- Advertisement -
న్యూఢిల్లీ: భారతీయులు విస్కీ త్రాగడంలో ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిచారు. అమెరికన్ల కంటే మూడు రెట్లు ఎక్కువగానే విస్కీ లాగించేస్తున్నారు. విస్కీ త్రాగడంలో అమెరికానే రెండో స్థానంలో ఉంది. పట్టణాల్లో నివసించే భారతీయుల్లో 16 శాతం మంది తమకు విస్కీయే ఫేవరేట్ పానీయం అని పేర్కొన్నారు. ఈ విషయాలు ‘యూగవ్’ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. భారతీయుల్లో చాలా మంది బర్త్‌డే వంటి సందర్భాల్లో విస్కీ సేవిస్తుంటామని సర్వేలో తెలిపారు. కొందరు వీకెండ్స్‌లో సేవిస్తుంటామన్నారు. ఇక రెగ్యులర్ తాగుబోతులయితే వేళాపాళ లేకుండా ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా త్రాగుతామని తెలిపారు.
- Advertisement -