Wednesday, January 22, 2025

ప్రపంచ వృద్ధిలో 15 శాతం భాగస్వామ్యం భారత్ దే: రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ప్రపంచ వృద్ధిలో భారత్ 15 శాతం భాగస్వామ్యం అవుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తెలిపారు. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రసంగించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఆమె అభినందనలు తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని గెలిచి సభకు ఎన్నికయ్యారని, దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశిస్తున్నామన్నారు. ఆర్థిక భరోసా కోసం నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నామని, చిన్న, సన్నకారు రైతుల కోసం పిఎం సమ్మాన్ నిధి తీసుకొచ్చామని, ప్రజా సంక్షేమ కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని, గ్రీన్ ఎనర్జీ సాధన దిశగా ప్రభుత్వం పని చేస్తోందని, ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని, ప్రపంచ వ్యాప్త డిమాండ్ మేరకు భారత్ ఉత్పత్తులను అందిస్తోందన్నారు.

కరోనాలాంటి కష్టకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని,  ఆయుష్మాన్ భారత్ తో దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని, ఆరోగ్య రంగంలో భారత్ అగ్రగామిగా ఉందని ఆమె వివరించారు. భారత్ వేగంగా పురోభివృద్ధి సాధిస్తోందని. గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా రోడ్ల విస్తరణ జరుగుతోందని, పౌరవిమానయాన రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని, పదేళ్లుగా అభివృద్ధి కోసం కేంద్రం పని చేస్తోందని ద్రౌపది ప్రశంసించారు. భారత ఎన్నికలపై ప్రపంచమంతా చర్చ జరిగిందని, 2024 సార్వత్రిక ఎన్నికల ఎంతో ప్రత్యేకమైని, జమ్ము కశ్మీర్‌లో పెద్ద ఎత్తున ప్రజలు ఓటేశారని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News