Monday, January 20, 2025

ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి: మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 75 ఏళ్ల తరువాత కొత్త పార్లమెంట్‌ను నిర్మించుకున్నామన్నారు. పవిత్రమైన సెంగోల్‌ను పార్లమెంట్‌లో ప్రతిష్టించుకున్నామని, భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. కొత్త పార్లమెంట్… కొత్త భారత్‌కు కొత్త జోష్ తీసుకొచ్చిందని ప్రశంసించారు.

Also Read: పొడిచిన చేతులతోనే దండం పెట్టే వ్యక్తి బాబు: పేర్ని నాని

ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని, 140 కోట్ల భారతీయుల కల సాకారమైందని, అధునిక భారత్‌కు కొత్త పార్లమెంట్ అద్దం పడుతుందని మోడీ కొనియాడారు. ఆత్మనిర్భర్ భారత్‌కు పార్లమెంట్ సాక్షంగా నిలుస్తుందని ప్రశంసించారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటిదన్నారు. అమృత్ కాల్‌లో అన్ని కఠిన సవాళ్లను అధిగమిస్తామని, ప్రజల ఆశలు, ఆకాంక్షలను కొత్త పార్లమెంట్ గౌరవిస్తుందన్నారు. కొత్త పార్లమెంట్ జాతీయ చిహ్నాలను ప్రతిబింభిస్తుందన్నారు. పాత పార్లమెంట్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవని మోడీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎంపిల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పార్లమెంట్‌ను నిర్మించామని, తొమ్మిదేళ్ల బిజెపి పాలనలో ఎన్నో విజయాలు సాధించామని, ఇతర దేశాలతో భారత్ సాగించిన ప్రయాణం ఆదర్శంగా నిలుస్తుందని మోడీ ప్రశంసించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News