Saturday, December 21, 2024

రష్యాపై ఒత్తిడికి భారత్ వణుకుతోంది : అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

India is trembling under pressure from Russia:Biden

 

వాషింగ్టన్ : ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా అమెరికా మిత్ర దేశాలన్నీ ఐక్యంగా ఉంటూ రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకొస్తుంటే భారత్ మాత్రం ఎందుకో కొంతవరకు భయపడుతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఈవోలతో సోమవారం జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో బైడెన్ మాట్లాడారు. నాటో కూటమిలో చీలిక తీసుకురాగలనని పుతిన్ లెక్కలు కూడా వేసుకున్నారని, కానీ నాటో కూటమి చరిత్రలో ఎన్నడూ లేనంత బలంగా , ఐక్యంగా ఉందని, ఇదంతా రష్యావల్లే అయిందనుకుంటున్నానని బైడెన్ వ్యాఖ్యానించారు. పుతిన్ దురాక్రమణను అడ్డుకోవడంలో నాటో, అమెరికా మిత్రదేశాలు, ఐరోపా సమాఖ్య, ఆసియా భాగస్వామ్య దేశాలన్నీ ఐక్యంగా ఉన్నాయన్నారు. క్వాడ్ కూటమి లోనూ జపాన్, ఆస్ట్రేలియా దేశాలూ రష్యాపై ఒత్తిడి తెస్తుండగా, ఒక్క భారత్ మాత్రమే వణకుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News