Thursday, January 23, 2025

భారత, ఇజ్రాయెల్ ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 8 బిలియన్ డాలర్లు

- Advertisement -
- Advertisement -

 

చండీగఢ్: భారత దేశం, ఇజ్రాయెల్ మధ్య దైపాక్షిక వాణిజ్యం దాదాపు 8 బిలియన్ డాలర్లకు చేరువలో ఉందని, ఈ సంఖ్యలో రక్షణ పరికరాలు లేవని భారత దేశంలోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ తెలిపారు. ఆయన ఏఎన్‌ఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వూలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 30 సంవత్సరాలు అయ్యిందని, రెండు దేశాల మధ్య 200 మిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగిందని తెలిపారు. “మేము 30 సంవత్సరాల క్రితం పూర్తి దౌత్య సంబంధాలను ప్రారంభించినప్పుడు, మా మధ్య 200 మిలియన్ డాలర్ల వాణిజ్యం ఉంది. ఇప్పుడు మా మధ్య వాణిజ్యం 200 మిలియన్ డాలర్లకు చేరువలో ఉంది. ఇది రక్షణ రంగానికి సంబంధించిన అంకెలు లేకుండా. మా మధ్య వాణిజ్యం బాగానే కొనసాగుతోంది” అన్నారు.

భారత దేశంలో తమ పెట్టుబడుల గురించి గిలోన్ వివరిస్తూ, దాదాపు 300 ఇజ్రాయెల్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాయి. పూణేలో ఆమ్‌డాక్స్ ఇజ్రాయెలీ కంపెనీ ఉంది. అందులో 14000 మంది భారతీయ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు.
“భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ ఇజ్రాయెల్‌లో ఉన్నప్పుడు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్‌టిఎ)ను ముందుకు తీసుకెళ్లడం గురించి మాట్లాడారు. కానీ దురదృష్టం కొద్దీ మేము ఇతర దేశాలతో ఎఫ్‌టిఎ సహా సమాంతరంగా పనులు చేస్తున్నందున దానిని పక్కన పెట్టాం. అది త్వరలో తిరిగా గాడీలోకి వస్తుందని ఆశిస్తున్నాను, మేము ఎఫ్‌టిఎను ఖరారు చేయగలము” అని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ అన్నారు.

రక్షణ, భద్రత రంగంలో భారత్, ఇజ్రాయెల్ నుంచి పెద్ద ఎత్తున మిలిటరీ పరికరాలు కొంటున్న దేశం. ఇజ్రాయెల్ ఎగుమతి చేస్తున్న మొత్తం ఆయుధాల్లో భారత్ వాటా 46 శాతంగా ఉంది. రష్యా తర్వాత భారత్‌కు ఎక్కువ మిలిటరీ పరికరాలు అమ్ముతున్న రెండో అతిపెద్ద దేశం ఇజ్రాయెల్. వ్యవసాయం, నీటి నిర్వహణ విషయలో కూడా రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ‘మషావ్’తో భారత అధికారులు భాగస్వాములయ్యారని ‘ద జెరూసలెం పోస్ట్’ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News