Sunday, December 22, 2024

227 బిలియన్ డాలర్లు

- Advertisement -
- Advertisement -
India IT revenue reaches key milestone
కీలక మైలురాయి చేరుకున్న భారత్ ఐటి ఆదాయం

ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(202122) ఐటి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగం 15.5 శాతం వృద్ధిని నమోదు చేసి 227 బిలియన్ డాలర్ల ఆదాయం మార్క్‌ను సాధించింది. ఈమేరకు మంగళవారం నాడు ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ప్రకటించింది. దశాబ్ద కాలంలో ఇదే అధిక వృద్ధి రేటు కావడం గమనార్హం. 1114 శాతం వృద్ధి రేటుతో 202526 ఆర్థిక సంవత్సరం నాటికి 350 బిలియన్ డాలర్ల మార్క్ లక్ష్యాన్ని చేరుకుంటామని పరిశ్రమ సంస్థ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. 202122లో పరిశ్రమ 4.50 లక్షల మందిని నియమించుకోగా, దీంతో ఐటి ఇండస్ట్రీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య మొత్తం 50 లక్షలకు చేరుకుంది. 50 లక్షల మందికి పైగా ఉద్యోగులతో భారతదేశం ఐటి రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా ఎదిగింది.

ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు ఇప్పటికే డిజిటల్‌గా నైపుణ్యం కల్గివున్నారని, 25 శాతం వృద్ధితో 16 లక్షల డిజిటల్ టెక్ టాలెంట్ పూల్‌ను కల్గివుంది. రిస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్‌పై పరిశ్రమ అధికంగా దృష్టి పెట్టింది. దీంతో ఈ ఏడాది మార్చి నాటికి సుమారు 2.80 లక్షల మంది ఉద్యోగుల నైపుణ్యాలు పెరుగుతాయని నాస్కామ్ తెలిపింది. 36 శాతం మహిళా ఉద్యోగులతో భారతీయ టెక్ పరిశ్రమ అతిపెద్ద ప్రైవేటురంగ మహిళా ఉపాధి పరిశ్రమగా ఉంది. మొత్తం మహిళా ఉద్యోగులు 18 లక్షల వరకు ఉన్నారు. నాస్కామ్ చైర్‌పర్సన్ రేఖా ఎం.మీనన్ మాట్లాడుతూ, 202122 ఆర్థిక సంవత్సరం దేశీయ టెక్నాలజీ పరిశ్రమకు అద్భుతమైనదిగా ఉందని అన్నారు. పటిష్టమైన, పోటీతత్వంతో కూడిన వృద్ధిని నమోదు చేశామని, భారీగా ఉద్యోగాలు పెరిగాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News