Wednesday, January 22, 2025

నీరజ్ మళ్లీ మెరవడం ఖాయం

- Advertisement -
- Advertisement -

అథ్లెటిక్స్ చీఫ్ అదిల్లె సుమరివల్లా

న్యూఢిల్లీ: పారిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరోసారి పసిడి పతకం గెలవడం ఖాయమని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ అదిల్లె సుమరివల్లా జోస్యం చెప్పారు. టోక్య ఒలింపిక్స్‌లో నీరజ్ అసాధారణ ఆటతో స్వర్ణ పతకం సాధించి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటడన్నారు. ఈసారి కూడా అతనిపై భారీ అంచనాలున్నాయన్నారు. కొంతకాలంగా నీరజ్ అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్నారన్నారు. అద్భుత ఫిట్‌నెస్‌తో పారిస్ క్రీడల్లో బరిలోకి దిగుతున్నాడన్నారు.

ఒలింపిక్స్‌తో పాటు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలు సాధించిన నీరజ్‌లో అపార నైపుణ్యం దాగివుందన్నారు. వర్తమానంతో జీవించే నీరజ్ తన కలలను సాకారం చేసుకునేందుకు సర్వం ఒడ్డుతాడని ప్రశంసించారు. కొంత మంది గతంలో సాధించిన విజయాలను నెమరేసుకుంటూ ఉండిపోతారని, నీరజ్ మాత్రం వాటికి భిన్నంగా ముందుకు సాగుతాడని కొనియాడారు. భారత అథ్లెటిక్ రంగానికి కొత్త దిశను చూపిన ఘనత నీరజ్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. టోక్యో ఒలింపిక్స్‌తో పాటు ప్రపంచ పోటీల్లో నీరజ్ సాధించిన స్వర్ణ పతకం భారత క్రీడా రంగచరిత్రలో తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు. నీరజ్ విజయానికి అతనిలో ఉన్న అపార ఆత్మవిశ్వాసమే కారణమన్నారు. పారిస్ క్రీడల్లో నీరజ్ తన 90 మీటర్ల కలను నెరవేర్చుకుంటాడనే నమ్మకాన్ని సుమరివల్లా వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News