జూనియర్ హాకీ జట్టు ఎంపిక
భువనేశ్వర్: పురుషుల జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును గురువారం ప్రకటించారు. 18 మందితో కూడిన బృందాన్ని భారత హాకీ సమాఖ్య ఎంపిక చేసింది. భారత జట్టుకు వివేక్ సాగర్ ప్రసాద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సంజయ్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తిస్తాడు. గ్రాహం రీడ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. నవంబర్ 24 నుంచి జూనియర్ ప్రపంచకప్ ఆరంభమవుతోంది. తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో భారత్ తలపడుతుంది. భువనేశ్వర్ వేదికగా ఈ టోర్నమెంట్ జరుగనుంది. కళింగా హాకీ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. కాగా, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. అంతేగాక భారత హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో జూనియర్ వరల్డ్‌కు కూడా ఒడిశానే ఆతిథ్యం ఇస్తోంది. డిసెంబర్ ఐదున ఫైనల్ పోరు జరుగనుంది.
జట్టు వివరాలు: వివేక్ సాగర్ ప్రసాద్ (కెప్టెన్), సంజయ్ (వైస్ కెప్టెన్), శ్రద్ధానంద్ తివారి, ప్రశాంత్ చౌహాన్ (గోల్ కీపర్), సుదీప్ చిర్మాకొ, రాహుల్ కుమార్ రాజ్‌బర్, మణీందర్ సింగ్, పవన్ (గోల్ కీపర్), విష్ణుకాంత్ సింగ్, అంకిత్ పాల్, ఉత్తమ్ సింగ్, సునీల్ జోజో, రబిచంద్ర సింగ్, అభిషేక్ లక్రా, యశ్‌దీప్ సివాచ్, గుర్ముక్ సింగ్, అర్జిత్ సింగ్ హుండాల్.