Monday, December 23, 2024

న్యాయవ్యవస్థ సమర్థతపై నివేదికను విడుదల చేసిన ఐజేఆర్ 2022

- Advertisement -
- Advertisement -

పోలీసు విభాగములో ఖాళీలను తగ్గించిన కొన్ని రాష్ట్రాల మధ్య ఒక స్థానాన్ని సురక్షితం చేస్తూ, ప్రభుత్వము పోలీసు విభాగములో తన మొతం ఖాళీల రేటును 2018లో 35% నుండి 2021 లో 24% కు తగ్గించింది. 2021లో, అన్ని భారతీయ రాష్ట్రాలలో తెలంగాణ అతితక్కువ అధికారుల ఖాళీలను (6%) రికార్డ్ చేసింది, ఇది 2018లోని 20% కంటే తక్కువ. కానిస్టేబుల్స్ లో, ఖాళీల రేటు 2018లో 37% నుండి 27% కు వచ్చింది. కుల వర్గాలలో, ఎస్‎సిలు 2015 నుండి 2021 మధ్య అత్యధిక ఖాళీలను నమోదు చేశాయి. ఇది 2021 లో 26% నుండి 18% కి పడిపోయింది. ఇదే సమయములో జనరల్ వర్గాలలో ఖాళీలు 68% నుండి 65% కు కొద్దిగా తగ్గాయి.

మరిన్ని అవకాశాలను సృష్టిస్తూ, ప్రభుత్వము పోలీసు బలగాన్ని నామమాత్రంగా పెంచింది. 2018లో 81,380 నుండి 2021 లో 82,347కు. అయితే, ఇంకా పోలీసు దళములో 19,000 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ‘జనరల్’ వర్గానికి చెందినవే.

పెరుగుదలలో కుల వైవిధ్యం, కాని రాష్ట్ర పోలీసుకు లింగ సమానత్వం ఇంకా ఒక సవాలుగానే నిలిచింది

పోలీసు విభాగములోని ‘జనరల్’ వర్గములోని మొత్తం వాటా 2018లోని 32% నుండి 2021లోని 23% తగ్గగా, ఓబిసీలు, ఎస్‎టీల ప్రాతినిథ్యములో గణనీయమైన పురోగతి ఉంది. 2015, 2021 రెండు సంవత్సరాలలో ఓబిసీలు, ఎస్‎టిలు తమ రిజర్వేషన్ కోటాలను నెరవేర్చాయి. 2021లో వరుసగా 30%, 38% తో తమ మంజూరు అయిన కోటాలను అధిగమించాయి. ప్రస్తుతం, ఓబిసీలు రాష్ట్ర పోలీసు విభాగములో 50% వరకు అత్యధిక వాటా కలిగి ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాలు (ఎస్‎సి), షెడ్యూల్డ్ తెగల (ఎస్‎టి) వాటాలు స్తబ్దుగా ఉండిపోయాయి. అయితే, 33% రిజర్వేషన్ ఉన్నప్పటికీ, మహిళలు మొత్తం పోలీసు బలములో కేవలం 8% మాత్రమే ఉన్నారు. ఈ రిజర్వేషన్ టార్గెట్ ను పూర్తి చేయుటకు, తెలంగాణ పోలీసు ఇంకా 21,876 మహిళలను నియమించవలసి ఉంటుంది.

హెచ్‎సి ఖాళీలు సగానికి తగ్గించబడ్డాయి, రిజర్వ్డ్ వర్గాలు, మహిళల ప్రాతినిథ్యం వృద్ధి చెందాయి

సబార్డినేట్ 2018, 2022 మధ్య న్యాయస్థానాలలో ఖాళీలు 16% నుండి 20% కొద్దిగా పెరుగగా, ఉన్నత న్యాయస్థానములో ఖాళీలు 46% నుండి 21% కి సగం అయ్యాయి. సబార్డినేట్ న్యాయస్థానాలలో మొత్తం 101 ఖాళీలలో, సగం కంటే ఎక్కువ ‘జనరల్’ వర్గానికి చెందినవే. రిజర్వ్డ్ వర్గాలలో, ఓబిసీలు, ఎస్‎టీలు తమ మంజూరు కోటాలను పూర్తిచేశాయి. ఇందులో ప్రభుత్వ న్యాయవ్యవస్థ (45%)లో ఓబిసీలు అత్యధిక వాటా కలిగి ఉన్నాయి. రెండు న్యాయస్థానాలలో మహిళల ప్రాతినిథ్యము కూడా గణనీయమైన పురోగతి చూపింది. ప్రస్తుతం, 2018లో రెండు కోర్టులలో 46%, 7% మాత్రమే ఉండగా, దానితో పోలిస్తే మహిళలు సబార్డినేట్ న్యాయస్థానాలలో 53% వాటా, ఉన్నత న్యాయస్థానములో 27% వాటా కలిగి ఉన్నారు.

తాజా సమాచారము ప్రకారము, తెలంగాణాలోని పోలీసు, జైళ్ళు, న్యాయవ్యవస్థలలో మొత్తం ఖాళీలు 20,759 ఉన్నాయి. ఎంఎస్. మాజా దారువాలా, చీఫ్ ఎడిటర్, ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2022.. “శక్తివంతమైన న్యాయ సంస్థలను, 2030 నాటికి అందరికి అందుబాటులో న్యాయాన్ని నిర్ధారించే మా విశ్వవ్యాప్త నిబద్ధతను నెరవేర్చుకొనుటకు మేము ప్రయత్నాలు చేస్తుండగా, ఇండియా జస్టిస్ రిపోర్ట్స్ ప్రస్తుత న్యాయవ్యవస్థలో, ముఖ్యంగా పోలీసు, న్యాయవ్యవస్థలలో, లోపాలను పరిష్కరించుటకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కొనసాగుతున్న సవాళ్ళలో అంతర్దృష్టితో కూడిన డైలాగ్‌ని ప్రేరేపించడం ద్వారా, ఈ అంతర్దృష్టులు తక్షణ, పునాది సంస్కరణలు రెండి కొరకు ఉన్న అవసరాన్ని పునరుద్ఘాటిస్తాయి, ఇవి చివరికి న్యాయమైన, సమానమైన సమాజానికి మార్గాన్ని సుగమం చేస్తాయి” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News