Saturday, November 16, 2024

హిందూ మహాసముద్రంలో చైనా నౌకలపై నిఘా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హిందూ మహాసముద్రంలో చైనా నౌకలు భారీ ఎత్తున కనిపిస్తున్నాయని, దేశ ప్రయోజనాల కోసం, సముద్ర ప్రాంత పరిక్షణ కోసం చాలా దగ్గరలో వాటిని పర్యవేక్షించడమవుతోందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ శనివారం వెల్లడించారు. ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ)కి చెందిన అనేక నౌకలు పాకిస్థాన్ రేవుల్లో స్థావరం ఉండడాన్ని భారత నేవీ అడ్డగించిందని చెప్పారు.

Also Read: కింగ్ చార్లెస్ పట్టాభిషేక కచేరికి సోనమ్ కపూర్‌కు ఆహ్వానం

పాకిస్థాన్ లోనే కాకుండా వివిధ దేశాల్లో పిఎల్‌ఎ నౌకలు స్థావరం ఉంటున్నాయని తెలిపారు. పాకిస్థాన్ నేవీ తనకు తాను ఆధునికీకరణ అవుతోందని, రానున్న 1015 సంవత్సరాల్లో 50 ప్లాట్‌ఫారాలు ఏర్పర్చుకుంటుందని తెలిపారు. తమ దళాల్లో మరిన్ని కొర్వెట్లు, యుద్ధ నౌకలు చేర్చుకుంటోందని, గత పదేళ్లలో చైనా భారీ ఎత్తున నౌకలను, సబ్‌మెరైన్లను పాకిస్థాన్‌కు అప్పగించినట్టు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News