Monday, December 23, 2024

స్కాచ్ విస్కీలో ఫ్రాన్స్‌ను దాటేసిన భారత్..

- Advertisement -
- Advertisement -

లండన్: స్కాచ్ విస్కీకి భారతదేశం అతి పెద్ద మార్కెట్ అయింది. బ్రిటన్ స్కాట్లాండ్ ఉత్పత్తి అయిన స్కాచ్ విస్కీ ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్రాన్స్‌కు ఎగుమతి అయ్యేది. అయితే ఫ్రెంచ్ స్కాచ్ గిరాకీని ఇప్పుడు ఇండియా తోసిరాజంది. గత ఏడాది అంతకు ముందటి ఏడాదితో పోలిస్తే ఇండియాలో ఈ స్కాచ్ విస్కీకి మార్కెట్ 60 శాతం పెరిగింది. ఈ విషయాన్ని స్కాట్లాండ్ విస్కీ తయారీ పరిశ్రమల గణాంకాలలో తెలియచేశారు.

భారత్‌లో క్రమేపీ స్కాచ్ విస్కీ ప్రియులు ఎక్కువ అవుతున్నారు. దీని నాణ్యత, ఆరోగ్యకరం రుచి తదితర అంశాలతో పాటు స్కాచ్ విస్కీకి ఉన్న ప్రతిష్టతో భారతీయులు అత్యధికంగా విస్కీ వైపు మొగ్గు చూపుతున్నారు. 2022 ఏడాది లెక్కలను స్కాచ్ విస్కీ అసోసియేషన్ వెలుగులోకి తెచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News