Monday, December 23, 2024

చంద్రుడిపై భారత్ చేరగా.. పాక్‌లో పిల్లల మరణాలా

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు ముత్తహిదా కయూమీ మూవ్‌మెంట్ పాకిస్థాన్ ( ఎక్యుఎంపి) పార్టీ నాయకుడు సయ్యద్ ముస్తఫా కమల్ , భారత్ సాధిస్తున్న పురోగతిని, తమ దేశంలోని దీనస్థితిని పోల్చుతూ పార్లమెంట్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కరాచీ లోని ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. “ అసిఫ్ అలీ జర్దార్ సహాబ్‌తో మనం సమస్యలపై మాట్లాడితే ఆయన సానుకూలంగా స్పందిస్తారు. సమస్యల పరిష్కారానికి ఆసక్తి చూపుతారు. ఈ సందర్భంగా తాను ప్రపంచమంతా చంద్రున్ని చేరుకోడానికి ముందుకు వెళ్తుంటే కరాచీలో మాత్రం పిల్లలు మురుగు కాలువల్లో పడి చనిపోతున్నారు. భారత్ చంద్రుడిపై కాలుమోపుతుంటే, పాక్ మాత్రం ఇంకా మురుగు కాలువల్లో పిల్లల మరణాలను నివారించలేక పోతోంది. ” టీవీలో చంద్రుడిపై భారత్ కాలుమోపినట్టు వార్తలు వచ్చాయి.

ఆ తరువాత రెండు సెకన్ల లోనే అదే తెరపై కరాచీలో పిల్లలు మురుగు కాలువల్లో పడి మరణించిన సమాచారం వచ్చింది. ప్రతి మూడు రోజులకు ఇదే వార్త. ” అని ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కరాచీని ప్రస్తావిస్తూ “పాకిస్థాన్‌కు కరాచీ ప్రధాన ఆదాయ వనరు. రెండు నౌకాశ్రయాలు ఉన్నాయి. దేశానికి ఈ నగరం ముఖద్వారం లాంటిది. కానీ 15 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో తాగునీరు కూడా అందడం లేదు. వచ్చిన కొద్దిపాటి నీటిని మాఫియా అక్రమంగా విక్రయిస్తోంది. దేశంలో సింధ్‌లో 48 వేల స్కూళ్లు ఉన్నాయి. 2.62 కోట్ల మంది పిల్లలు స్కూల్‌కు వెళ్లడం లేదు. కరాచీ, సింధ్‌ల్లో కనీస సౌకర్యాలు లేవు ” అంటూ పాక్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను సయ్యద్ ముస్తఫా వివరించారు. గత ఏడాది భారత్ చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. మరోవైపు పాక్ మాత్రం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. పూర్తిగా ఐఎంఎఫ్ సాయంతో నెట్టుకొస్తోంది. మరిన్ని నిధుల కోసం ప్రస్తుతం చర్చలు జరుపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News