Monday, December 23, 2024

భారతీయుల రప్పింతకు ఆపరేషన్ అజయ్ అమలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్‌లో ఇప్పుడు చిక్కుపడ్డ భారతీయులను స్వదేశానికి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ చేపట్టింంది. హమాస్, ఇజ్రాయెల్ బలగాల పరస్పర దాడులతో ఇప్పుడు పశ్చిమాసియాలో పరిస్థితి గడ్డుగా మారింది. ఈ నేపథ్యంలో ఘర్షణల తాకిడి ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతాలలోని భారతీయులు భారత్‌కు తిరిగి రావాలనుకుంటే వారిని తీసుకువచ్చేందుకు కేంద్రం ఈ సహాయక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇజ్రాయెల్‌లోని ఉన్నతాధికారులు, అక్కడి భద్రతా బలగాల సాయంతో ఎయిరిండియా , దౌత్యకార్యాలయాల సమన్వయంతో ఆపరేషన్ అజయ్‌ను నిర్వహిస్తారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News