Saturday, January 11, 2025

సూడాన్ నుంచి భారతీయుల తరలింపుకు ‘ఆపరేషన్ కావేరీ’!

- Advertisement -
- Advertisement -
హింసాత్మకంగా మారిన సూడాన్ నుంచి తన పౌరులను తరలించడానికి భారత్ ‘ఆపరేషన్ కావేరీ’ అనే రెస్యూ ఆపరేషన్ చేపట్టింది.

న్యూఢిల్లీ: హింసాకాండ చెలరేగుతున్న సూడాన్ నుంచి భారతీయులను ఖాళీ చేయించేందుకు భారత్ ‘ఆపరేషన్ కావేరీ’ చేపట్టింది. ఈ ఆపరేషన్ ఇప్పటికే చేపట్టామని, 500 మంది భారతీయులు సోమవారం సూడాన్ పోర్ట్‌కు చేరుకున్నారని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ‘వారిని తీసుకురావడానికి మన నౌకలు, విమానాలు సిద్ధంగా ఉన్నాయి. సూడాన్‌లోని మన సోదరులను రక్షించుకునేందుకు, సాయపడేందుకు కమిట్ అయ్యాము’ అని ట్వీట్‌లో తెలిపారు.
సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను కాపాడేందుకు రెండు సి130 విమానాలు, నావికా నౌక ఐఎన్‌ఎస్ సుమేధను సిద్ధంగా ఉంచారు. అధికార డేటా ప్రకారం సూడాన్‌లో 4000 మంది భారతీయులు ఉన్నారు.

జై శంకర్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలతో కూడా మాట్లాడారు. ఆ రెండు దేశాలు కూడా సాయపడతామని హామీ ఇచ్చాయి. సూడాన్‌లో అధికారం కోసం హింసాత్మక ఘర్షణ జరుగుతోంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న అంతర్జాతీయ ప్లాన్‌ను కూడా అక్కడి వారు తిరస్కరించి పోరాడుతున్నారు. రెండు పక్షాల వారు ఒకరినొకరు నిందించుకుంటూ ఘర్షణ పడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News